లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకోవడం, జనాలు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడంతో మేకర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్న సినిమాలను సైతం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. మార్చి నుండి మీడియం, భారీ బడ్జెట్ సినిమాల హవా మొదలుకానుంది. దీంతో చిన్న సినిమాలు వాటి మధ్య చోటు దొరుకుతుందో లేదోననే అనుమానాలతో వీలైనంత త్వరగా థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి.
ఈ వారం నుండి చిన్న సినిమాల జాతర కనిపించబోతుంది. ఈ వీకెండ్ లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ‘జాంబీరెడ్డి’, ‘జీ-జాంబీ’, ‘ చేతిలో చేయ్యేసి చెప్పు బావా’, ‘రాధా కృష్ణ’, ‘నాతో ఆట’, ‘విఠల్ వాడీ’, ‘జర్నలిస్ట్’, ‘ప్రణవం’, ‘జై మరియమ్మ’, ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’.. ఇలా మొత్తం పది సినిమా ఫిబ్రవరి 5న విడుదల కాబోతున్నాయి.
వీటిలో ‘జాంబీరెడ్డి’ సినిమాపైనే కాస్త అంచనాలు ఉన్నాయి. ఎక్కువ శాతం థియేటర్లు దక్కించుకున్న సినిమా కూడా ఇదే. ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ సినిమా కావడం.. పైగా జాంబీ జోనర్ లో వస్తోన్న మొదటి తెలుగు సినిమా కావడంతో.. దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మిగిలిన సినిమాలు ప్రమోషన్స్ లో వెనుక బడడంతో జనాల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాయి.
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!