Tollywood: ‘సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు..’ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్!

వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా పరిశ్రమ మీద, నిర్మాతల మీద చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సినిమా వాళ్లు, నిర్మాతలు బలిసి కొట్టుకుంటున్నారని కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నిర్మాతల మండలి స్పందించింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. ”కోవూరు శాసన సభ్యులు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు సినిమా నిర్మాతలనుద్దేశించి మాట్లాడుతూ ‘మన సినిమా నిర్మాతలను బలిసినవాల్లు, అని’ అనడం జరిగింది.

ఇది చాలా బాధాకరం, నిజ నిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టు గా భావిస్తున్నాము.మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5% మాత్రమే మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది. చిత్రసీమలో ఉన్న 24 కాప్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది.

ఈ కష్ట, నష్టాల బారిన పడి కొంతమంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుండి నెలకు 3000/- రూపాయలు పెన్షన్ తీసుకోవడం. జరుగుతుంది.దీనిని బట్టి చలన చిత్ర నిర్మాతలు ఎటువంటి దారుణ పరిస్థితులలో ఉన్నారన్న సంగతి తేట తెల్లమవుతుంది. గౌరవ సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము” అంటూ లేఖలో పేర్కొన్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus