విజయ్ కొత్త సినిమాకి భారీ డిమాండ్!

తమిళ సూపర్ స్టార్ విజయ్ తన నెక్స్ట్ సినిమాను లోకేష్ కనగరాజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ‘లియో’ అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ చిన్న టీజర్ కూడా వదిలారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ లో మొదలుపెట్టారు. ‘విక్రమ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు లోకేష్.. ‘లియో’తో మరింత పెద్ద సక్సెస్ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అలానే ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఫుల్ హైప్ వచ్చింది. దానికి తగ్గట్లే సినిమాకి మంచి డీల్స్ వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి కొన్ని రోజులు కూడా కాకముందే.. సినిమా శాటిలైట్, ఓటీటీ హక్కులు అమ్ముడైపోయాయి.

ఎంతకి అమ్ముడయ్యాయో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. మొత్తం రూ.246 కోట్లకు శాటిలైట్, ఓటీటీ రైట్స్ ని అమ్మేశారు. తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్ అని చెప్పుకుంటున్నారు. షూటింగ్ మొదలుపెట్టిన వెంటనే ఇంత భారీ రేటుకి నాన్ థియేట్రికల్ రైట్స్ సేల్ అవ్వడంతో నిర్మాత ఫుల్ ఖుషీ అవుతున్నారట. ఈ మధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలు చూసేస్తున్నారు.

అందుకే ఓటీటీ నిర్వాహకులు భారీ రేట్లకు స్టార్ హీరోల సినిమాలను కొనుక్కుంటున్నారు. అందుకే విజయ్ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రూ.246 కోట్లకు పలికాయి. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో ఒక భాగమని టాక్.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus