Dil Raju Son: విజయ్ చేతిలో దిల్ రాజు కొడుకు.. వైరల్ అవుతున్న ఫోటో..!

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ను ప్రారంభించిన దిల్ రాజు, ఆ తర్వాత నిర్మాతగా మారి తక్కువ టైంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ ను స్థాపించి ఆయన 50 సినిమాల వరకు నిర్మించారు. ఇక ఆయన మొదటి భార్య అనిత అనారోగ్యంతో 2017 లో మరణించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత ఆయన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు.

కరోనా లాక్ డౌన్ టైంలో ఆయన రెండో పెళ్లి ఆయన సొంత ఊరులో సింపుల్ గా జరిగింది.ఆ తర్వాత ఈ జంట చాలా ఈవెంట్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు డ్రెస్సింగ్ స్టైల్ కూడా పెళ్ళైన తర్వాత మారిపోయింది. ఇక ఈ జంట ఈ ఏడాది ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఆ బిడ్డకు అన్వై రెడ్డి అనే పేరుని ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు ఆ పిల్లాడి ఫేస్ ను దిల్ రాజు రివీల్ చేయలేదు.

సోషల్ మీడియాలో అయితే చాలా ఫోటోలు షేర్ చేశారు కానీ ఆ పిల్లాడి ఫేస్ అందులో కనబడలేదు. అయితే దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘వారసుడు'(తమిళంలో ‘వరిసు’) అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా విజయ్ ను.. దిల్ రాజు తన ఇంటికి ఆహ్వానించడంతో ….విజయ్ దిల్ రాజు కొడుకుని ఎత్తుకుని ఆడిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus