సాధారణంగా రాజకీయాల్లోకి సినీ హీరోలు కెరీర్ మొత్తం అయిపోయిన తర్వాత , స్టార్ స్టేటస్ మొత్తం పోయాక వస్తుంటారు. కానీ నెంబర్ 1 హీరో గా కొనసాగుతూ కూడా రాజకీయాల్లోకి రావడం అనేది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయం లో మాత్రమే చూసాము.యంగ్ వయస్సులో , కెరీర్ లో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్ళినప్పుడు , ఎవ్వరైనా కెరీర్ లో ఇంకా ఎంత ఎత్తుకి ఎదగగలం అని చూస్తారు.
కానీ ఆ సమయం లో కెరీర్ ని రిస్క్ లో పెట్టి ఎవ్వరూ కూడా రాజకీయాల్లోకి రావాలి అనుకోరు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఇప్పుడు అదే దారిలో తమిళ స్టార్ హీరో ఇలయథలపతి విజయ్ కూడా నడవబోతున్నాడు. తమిళ నాడు లో ప్రస్తుతం ఆయన రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎలాంటి సినిమాలు తీసినా జనాలు నీరాజనం పలుకుతున్నారు.
బిలో యావరేజి సినిమాలు కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయిపోతున్నాయి. ఇలాంటి స్టార్ స్టేటస్ ని ఎవరైనా వదులుకుంటారా?, కానీ విజయ్ ఈ స్టార్ స్టేటస్ ని జనం కోసం త్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. ప్రస్తుతం ఆయన ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ‘లియో’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ విరామం లేకుండా సాగుతుంది, ఈ సినిమా తర్వాత ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు విక్రమ్ ప్రభు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.
రీసెంట్ గానే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడని, ఇక నుండి తన పూర్తి జీవితం ప్రజలకే అంకితం చేస్తూ రాజకీయ అరంగేట్రం చేసి, 2026 ఎన్నికలలో పోటీ చేయబోతున్నాడని తమిళనాడు మొత్తం కోడై కూస్తుంది. దీనిపై విజయ్ అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చెయ్యబోతున్నాడు.