Thalapathy Vijay: ఆల్ టైం రికార్డ్ సృష్టించిన విజయ్ చివరి సినిమా..!
- January 29, 2025 / 03:13 PM ISTByPhani Kumar
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalpathy) పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) (The Greatest of All Time) అతని చివరి సినిమా అంటూ ప్రచారం జరిగింది. కానీ దానికి ముందు ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ వారికి విజయ్ ఒక సినిమాకు సైన్ చేయడం వల్ల.. వాళ్ళతో ఒక సినిమా చేస్తున్నాడు. అదే ‘జన నయాగన్’. మొదట ఇది ‘దళపతి 69′(వర్కింగ్ టైటిల్) ప్రచారమయ్యింది. హెచ్ వినోద్ (H Vinoth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ అధినేత వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు.
Thalapathy Vijay

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమాగా పరిచయమవుతుండడంతో హైప్ ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో ‘జన నాయగన్’ బిజినెస్ ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయి. రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి అప్పుడే ఓవర్సీస్ బిజినెస్ జరిగిపోయిందట. అవును.. ‘జన నాయగన్’ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే అప్పుడే రూ.75 కోట్లు వచ్చేశాయట. తమిళ సినీ చరిత్రలో ఇంత మొత్తానికి ఓవర్సీస్ బిజినెస్ చేసిన సినిమా ‘జన నాయగన్’ కావడం విశేషంగా చెప్పుకోవాలి.

చూస్తుంటే సౌత్లో కూడా ఈ సినిమా భారీ బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో నిర్మాతకి డబుల్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక ‘జన నాయగన్’ లో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ కాగా ‘ప్రేమలు’ (Premalu) ఫేమ్ మమిత బైజు (Mamitha Baiju) కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ప్రియమణి, బాబీ డియోల్ (Bobby Deol), గౌతమ్ మీనన్ (Gautham Vasudev Menon), ప్రకాష్ రాజ్ (Prakash Raj) వంటి స్టార్లు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.















