Naga Chaitanya: మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!
- January 28, 2025 / 10:10 PM ISTByPhani Kumar
ఈరోజు అనగా జనవరి 28న ‘తండేల్’ (Thandel) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్లో జరిగింది. సినిమా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో తీయడం వల్ల ప్రమోషన్స్ అక్కడ నుండే మొదలుపెట్టారు మేకర్స్. ఇక ఇందులో భాగంగా నాగ చైతన్య (Naga Chaitanya) స్పీచ్ ఇస్తూ తాను వైజాగ్ అల్లుడని చెప్పుకొచ్చాడు. అతని భార్య శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) వైజాగ్ కి చెందిన అమ్మాయి అని ఎక్కువ మందికి తెలిసుండదు. ఈ విషయాన్ని అతను గుర్తుచేస్తూ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు.
Naga Chaitanya

నాగ చైతన్య (Naga Chaitanya) మాట్లాడుతూ.. ” ‘తండేల్’ సినిమా నుండి చాలా నేర్చుకున్నాను. మేము ఏ కష్టం లేకుండా పెరిగాం. కానీ ఇక్కడి జనాలు ఎంత కష్టపడుతున్నారో చూస్తే నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇక ‘తండేల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముందుగా.. వైజాగ్ ప్రజలకి చూపించడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. వైజాగ్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వైజాగ్ ఎంత స్పెషల్ అంటే.. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను.

ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. సో బ్రదర్స్.. ఒక చిన్న రిక్వెస్ట్…’తండేల్’ సినిమాకి వైజాగ్లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి. లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో..! సో ప్లీజ్..!సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ‘ఈ పాలి యాట మామూలుగా ఉండదేస్..! ఇక రాజులమ్మ జాతరే. దుళ్లగొట్టేస్తున్నాం. మా నాన్న, మన కింగ్ స్టైల్లో చెప్పాలంటే ‘వస్తున్నాం కొడుతున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం అతని కామెంట్స్ వైరల్ గా మారాయి.













