పవన్ కోసం బెస్ట్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్న థమన్..!
- February 8, 2020 / 09:15 PM ISTByFilmy Focus
2020 ని ఘనంగా ప్రారంభించారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఆయన అల వైకుంఠపురంలో సినిమా కోసం ఇచ్చిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మూవీ విజయంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు కాపీ సాంగ్స్ చేస్తుంటాడు, ఒకే రకమైన సంగీతం ఇస్తారు అంటూ వచ్చిన విమర్శలకు ఆయన అల వైకుంఠపురంలో మూవీ సాంగ్స్ తో గట్టి సమాధానం చెప్పారు. ఇక ఈ ఏడాది రెండు పెద్ద ప్రాజెక్ట్స్ థమన్ చేతిలో పడ్డాయి. వాటిలో ఒకటి మహేష్-వంశీ పైడిపల్లి మూవీ కాగా మరోటి పవన్ కమ్ బ్యాక్ మూవీ పింక్ రీమేక్.

కాగా పవన్ సినిమా లోని కొన్ని పిక్స్ ఆయన చూశారట. వాటిలో పవన్ మంట పుట్టించేలా ఉన్నాడట. ఇక ఈ సినిమా కోసం ఆయన బెస్ట్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారట. ఆయన శక్తి మేర గొప్ప ట్యూన్స్ పింక్ రీమేక్ మూవీ కోసం చేస్తానంటూ ఫ్యాన్స్ కి ట్విట్టర్ వేదికగా ఆయన హామీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొరకు మొదటిసారి థమన్ పనిచేస్తున్నారు. థమన్ ఫార్మ్ చూస్తుంటే ఆయన పవన్ కొరకు ఓ రేంజ్ ఆల్బమ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. పవన్ కోసం బెస్ట్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్న థమన్..!

Most Recommended Video
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

















