Thaman: తన భార్య గురించి తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఈరోజు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S.S.Thaman) పుట్టినరోజు. నేటితో 41 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తమన్ కి సోషల్ మీడియా నుండి బర్త్ విషెస్ తెగ అందుతున్నాయి. కాగా.. తన పుట్టినరోజును పురస్కరించుకుని తమన్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  ‘పుష్ప 2’ (Pushpa2)  ‘ది రాజాసాబ్’ (The Rajasaab)  సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చాడు.

Thaman

ఇదిలా ఉండగా.. తమన్ కి పెళ్ళై 17 ఏళ్ళు నిండిన కొడుకు కూడా ఉన్నాడు అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), అఖిల్ (Akhil Akkineni)  వంటి హీరోలు పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. తమన్ భార్య పేరు శ్రీ వర్దిని కానీ ఈమె ఫోటోలు ఎక్కువ బయటకి రాలేదు. గతంలో ఈమె మణిశర్మ (Mani Sharma) , యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ చేసిన సినిమాలకు ప్లే బ్యాక్ సింగర్ గా పనిచేసింది.

తమన్ సంగీతంలో రూపొందిన సినిమాల్లో కూడా 4 పాటలు పాడింది. మొన్నామధ్య తమన్.. ‘నా భార్య వర్దిని తో స్టేజ్‌ షోలు చేయాలని ఉంది. కానీ ముందుగా ఆమె రెండు,మూడు సూపర్‌ హిట్ పాటలు పాడి ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మరోసారి తన భార్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

తమన్ మాట్లాడుతూ..’నా భార్యే నా అకౌంట్, మ్యూజిక్ వ్యవహారాలన్నీ చూస్తుంది. నాకు ఏమైనా అవసరం ఉంటే ఇప్పటికీ ఆమెనే అడుగుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అతని కొడుకు ఐఐటీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడట. ఇక తమన్ ‘ఫ్యామిలీ కూడా నెమ్మదిగా హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నట్టు’ కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus