సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ‘ ‘గేమ్ ఛేంజర్’ కి (Game Changer) చేసిన తప్పు ‘రాజా సాబ్’ కి (The Rajasaab) చేయను’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో అతని కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దాని వెనుక అతని ఉద్దేశం వేరే ఉంది. తమన్ మాట్లాడుతూ.. ” ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి నేను 2021 లోనే సాంగ్స్ అన్నీ కంపోజ్ చేసేశాను. కానీ రిలీజ్ టైంకి ఆ పాటలు అన్నీ పాత ట్యూన్స్ తో కంపోజ్ చేసిన పాటల్లా అనిపించాయి. అందుకే అవి జనాల్లోకి వెళ్ళలేదు.
ఇంకో డ్రా బ్యాక్ ఏంటంటే.. ‘గేమ్ ఛేంజర్’ పాటలన్నిటిలో సరైన హుక్ స్టెప్ ఉండదు. అందువల్ల కూడా ఆ పాటలు జనాల్లోకి వెళ్ళలేదు. మనం కంపోజ్ చేసే పాటలు జనాల్లోకి వెళ్ళాలి అంటే కొరియోగ్రఫీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) సినిమాల్లోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఎందుకంటే.. అన్ని పాటల్లోనూ హుక్ స్టెప్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అవి ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాయి.
ఏదేమైనా ‘గేమ్ ఛేంజర్’ మ్యూజిక్ విషయంలో పొరపాటు జరిగింది. అది నాకు గొప్ప గుణపాఠం. అదే మిస్టేక్ ‘రాజా సాబ్’ కి జరగకూడదు అని భావిస్తున్నాను. అందుకే ‘రాజా సాబ్’ సినిమాకి గాను నేను ఇప్పటివరకు కంపోజ్ చేసిన ట్యూన్స్ అన్నీ మార్చేయాలని భావిస్తున్నాను. సాంగ్స్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అందుకే ఈలోపు సాంగ్స్ అన్నీ కొత్తగా కంపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు. అది మేటర్.