‘పుష్ప 2’ (Pushpa2) షూటింగ్ చివరి దశలో ఉండగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ను (Devi Sri Prasad) తప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాటలకి అతనే సంగీతం అందించాడు. కానీ నేపధ్య సంగీతానికి గాను దేవీని పక్కన పెట్టి.. తమన్ (S.S.Thaman) , సామ్ సి ఎస్ (Sam C. S.) , అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath)వంటి ముగ్గురు సంగీత దర్శకులతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టించుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్(Sukumar) . అయితే ఈ విషయంపై ఈ ముగ్గురు దర్శకులు ఇప్పటివరకు స్పందించింది లేదు.
కానీ ఈరోజు తమన్ ఓపెన్ అయ్యాడు. ఈరోజు అతని నెక్స్ట్ సినిమా ‘డాకు మహారాజ్’ సినిమా టీజర్ లాంచ్ వేడుక జరిగింది. దీనికి ‘క్యూ అండ్ ఎ’ లో భాగంగా తమన్ కి ఒక ప్రశ్న ఎదురైంది. ‘మీరు మ్యూజిక్ అందించిన రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. అయినా సరే ‘పుష్ప 2′ వంటి పెద్ద సినిమాకి పని చేయడం ఎలా కుదురుతుంది? అందుకు మీ నిర్మాతలు ఎలా ఒప్పుకుంటున్నారు?’ అంటూ తమన్ ని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు.
ఇందుకు తమన్ మాట్లాడుతూ.. “నేను ‘పుష్ప 2’ లో ఒక పార్ట్ అయ్యాను. జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. ‘పుష్ప 2’ చాలా పెద్ద సినిమా. వరల్డ్ వైడ్ దానికి చాలా ఎక్కువ బిజినెస్ జరిగింది. మన నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని.. కొన్ని విషయాలు ఛాలెంజింగ్ గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు. కానీ అదే టైంలో మనం భయపడాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి.
15 రోజుల్లో మనం ఎలా అంత పెద్ద సినిమాకి పనిచేయగలము వంటివి..! కానీ నేను సినిమా చూశాను. చాలా గొప్ప సినిమా. నేను ఒక చిన్న పార్ట్ మాత్రమే చేయగలిగాను. అయినప్పటికీ డైరెక్టర్ గారు, హీరో గారు చాలా హ్యాపీ. నా సినిమాలు రిలీజ్ ఉన్నప్పటికీ.. నిర్మాతలు నాకు సాయంగా ఉండటం అనేది కూడా నాకు సంతోషాన్నిచ్చే విషయం” అంటూ చెప్పుకొచ్చాడు.