సంగీతం అంటే మనకు గుర్తొచ్చే, కనిపించే పరికరాలే కావు. ఇంకా చాలా ఉంటాయి అని అంటుంటారు. విదేశాల్లో అయితే విచిత్రమైన వాద్య పరికరాలు చాలానే ఉంటాయి. ఒక్కోసారి చిన్న బూర గొట్టం కూడా సంగీతం కోసం పనికొస్తుంది అని ఆ మధ్య దేవిశ్రీ ప్రసాద్ నిరూపించారు. ఆ సినిమా వచ్చినప్పుడు అది బాగా ఫేమస్ కూడా అయింది. ఆయన గతంలో విదేశీ వాద్య పరికరాలు చాలానే యూజ్ చేశారు కూడా.
ఇక ఇప్పుడు తమన్ మరో రకం వాద్య పరికం తీసుకొచ్చారు. జపాన్‌లో కొటో అని పిలుచుకునే ఈ పరికరాన్ని ఇప్పుడు ‘ఓజీ’ సినిమా కోసం వాడుతున్నారు. తమన్ ఇటీవల తన ఎక్స్ పేజీలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో తీగలు ఉన్న ఓ డబ్బా కనిపించింది. దానిపై వయోలిన్ స్టిక్‌తో మోగిస్తూ కనిపించారు. ఆ సౌండ్ వింటుంటే ఓజీ సినిమా నుండి ఇటీవల వచ్చిన ‘ఫైర్ స్టార్మ్’ పాట మ్యూజిక్ కొద్దిగా సింక్ అవుతోంది. దాంతోపాటు ఆయన ఆ పోస్టులో ‘ఓజీ’ సినిమా బీజీఎం కోసం ట్రై చేస్తున్నా అని కూడా రాశారు.
జపాన్ మూలాలున్న ఈ కథ కోసం జపాన్ నుండి ఈ పరికరం తెచ్చి సంగీతం వాయిస్తున్నారు. వీడియో మ్యూజిక్ ఓ రకంగా వినిపిస్తున్నా.. ఫైనల్ మిక్సింగ్ తర్వాత అదిరిపోయేలా ఉంది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓజీ’. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా నటించాడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబరు 25న విడుదల చేయనున్నారు.
ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. అగ్ని తుపాను, ఓజస్ గంభీర ధైర్యసాహసాలు అంటూ సినిమాలో హీరో పాత్రను ఓ లెవల్‌లో ఎలివేట్ చేశారు. మరి థియేటర్లలో ఈ లెవల్ మ్యూజిక్‌తో పవన్ స్క్రీన్ ప్రజెన్స్ ఇంకెంత మజాను తీసుకొస్తుందో చూడాలి. ఫ్యాన్ బాయ్ సుజీత్ తన స్టార్‌కి ఎలాంటి సినిమా రాశారు అనేది ఆసక్తికరమే.
#OgBgm
This instrument is calked Japanese ( koto )
Just tried With A violin Bow
Sounded this way pic.twitter.com/4xI3VE9Yyv— thaman S (@MusicThaman) September 6, 2025