Thaman: ఆయన పేరు పలకడం థమన్ కు ఇష్టం లేదా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హవా కొనసాగుతోంది. దర్శకనిర్మాతలు థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో సినిమాలను నిర్మించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది రిలీజైన అల వైకుంఠపురములో సినిమాతో థమన్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కు థమన్ గట్టి పోటీ ఇస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ థమన్ మధ్య కోల్డ్ వార్ ఉందని ఇండస్ట్రీకి చెందిన చాలామంది భావిస్తారు.

ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ కు థమన్, దేవి శ్రీ ప్రసాద్ గెస్టులుగా వచ్చిన సమయంలో వీళ్లిద్దరూ ఎంతో క్లోజ్ గా కనిపించారు. అయితే తాజాగా థమన్ అభిమానులతో ముచ్చటించగా ఒక నెటిజన్ పుష్ప పాటలపై మీ అభిప్రాయం ఏమిటి? ఎంజాయ్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు థమన్ సమాధానం ఇస్తూ పుష్ప పాటలు నచ్చాయని అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు.

అయితే దేవి శ్రీ ప్రసాద్ గురించి మాత్రం థమన్ ట్వీట్ లో పేర్కొనలేదు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ పేరు పలకడం థమన్ కు ఇష్టం లేదా? అని నెటిజన్లు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. థమన్ ప్రస్తుతం అఖండ, గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు రిలీజైన తర్వాత థమన్ కు క్రేజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus