ఈ మధ్య సినిమా హిట్టు విషయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇటీవల వచ్చిన ‘మజిలీ’ ‘మహర్షి’ చిత్రాలే ఇందుకు ఉదాహరణ. మొన్నటి వరకూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అందులోనూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా దేవి శ్రీ ప్రసాద్ టాప్ అని చెప్పేవారు. కానీ తాజాగా విడుదలైన ‘మహర్షి’ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. ‘మహర్షి’ చిత్రానికి మంచి టాకే వచ్చింది. కానీ దేవి శ్రీ మ్యూజిక్ అందులోనూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా మైనస్ అయ్యింది. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కూడా బాగా హర్టయ్యారు. కానీ ‘మజిలీ’ చిత్రంలో తమన్ మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో కూడా అంతా గమనించాల్సి ఉంది. ఈ చిత్రం కొత్త కథ కాదు.. అన్నీ సున్నితంగా ఉండే సీన్లే ఎక్కువ కానీ… తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టింది.
దీంతో ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి కూడా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటే బాగుణ్ణు అని ఆ చిత్ర డైరెక్టర్ సుజీత్ ఆలోచిస్తున్నాడట. అయితే ఇందుకు ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ ఎహసాన్ లాయ్ ఒప్పుకుంటాడా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే సినిమాకు సంగీతం, రీరికార్డింగ్, బిజీఎమ్ అంతా ఆయన చేతే చేయించుకోవాలనే ఎగ్రిమెంట్ ఉందట. ఇప్పుడు హఠాత్తుగా తమన్ ని సీన్ లోకి తెస్తే లేనిపోని వివాదాలు వస్తాయేమో అనే డౌట్ లో కూడా నిర్మాతలు ఉన్నారట. ఒక వేళ తమన్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. తమన్ ఇప్పటికే ‘ షేడ్స్ ఆఫ్ సాహో’ మేకింగ్ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు. ఆ మేకింగ్ వీడియో అంతలా హిట్టవ్వడానికి తమన్ మ్యూజిక్ కారణమని చెప్పాలి.