మణిశర్మకు తెలియకుండా దేవీతో పని చేసిన తమన్‌.. ఎప్పుడంటే?

దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌… 20 ఏళ్లుగా సినిమా సంగీతంలో ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న సంగీత దర్శకులు వీరిద్దరే అని చెప్పాలి. మిగిలిన సంగీత దర్శకులు వస్తున్నా.. వీళ్లలా వరుస సినిమా ఛాన్స్‌లు, హిట్‌ పాటలు ఇవ్వలేకపోతున్నారు. ఈ ఇద్దరూ ఇటీవల ‘ఆహా’ కోసం ఒకే వేదిక మీద కనిపించారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒకానొక సమయంలో దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న సినిమా కోసం తమన్‌ కూడా పని చేశారట.

తమన్‌ సంగీత దర్శకుడిగా మారకముందు మణిశర్మ దగ్గర టీమ్‌లో ఉండేవారనే విషయం తెలిసిందే. ఆ సమయంలో దేవిశ్రీప్రసాద్‌ దగ్గర కూడా కొన్ని సినిమాలకు, పాటలకు మ్యూజిక్‌ టీమ్‌లో పని చేశారట. మణిశర్మకు తెలియకుండా రాత్రిళ్లు దేవిశ్రీప్రసాద్‌ దగ్గర పని చేశారట. ఈ విషయాన్ని తమనే చెప్పుకొచ్చారు. మొత్తం సంగీత సామాగ్రిని తీసుకొని దేవిశ్రీప్రసాద్‌ దగ్గరకు వెళ్లేవారట. అలా రాత్రిళ్లు కలసి పాటలకు స్వరాలు సమకూర్చారమని చెప్పుకొచ్చారు.

ఈ మాటలు తమన్‌ చెబుతుంటే.. మణిశర్మ గారికి అప్పుడు తెలియదని, ఇప్పుడు తెలిసినా ఫర్వాలేదని నవ్వేసుకున్నారు కాసేపు ఇద్దరు. అలా నాటి విషయాలు తెలిశాయి. ఇలా డీఎస్పీ టీమ్‌లో ‘బొమ్మరిల్లు’, ‘రెడీ’,‘మల్లన్న’ సినిమాలకు పని చేశానని చెప్పుకొచ్చారు తమన్‌. Devi అనే పేరుకు చివర L యాడ్‌ చేయొచ్చని.. అలా డెవిల్‌ అవుతాడని, పనిలో డెవిల్‌లా కనిపిస్తాడని తమన్‌ చెప్పారు. ఇక తమన్‌ సంగీతం అందించిన ‘సామజవరగమన…’ పాటకు తనకు బాగా ఇష్టమని దేవిశ్రీప్రసాద్‌ చెప్పగా…

డీఎస్పీ సంగీతం అందించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలోని పాటలన్నీ తనకు ఇష్టమని తమన్‌ చెప్పారు. అలాగే ఇదే షోలో ‘వెంకీ’ సినిమాలో ‘గోంగూర తోటకాడ..’ పాట గురించి, దాని వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను కూడా చెప్పుకొచ్చారు డీఎస్పీ. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లోని పాటల సంగతి గురించి కూడా చెప్పుకొచ్చారు డీఎస్పీ. త్రివిక్రమ్‌తో కలసి పని చేయడం గురించి మాట్లాడుకున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus