ఓ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంటే.. దానిని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత చిత్ర బృందానికి ఉంటుంది. అందుకోసం సక్సెస్ మీట్లు వంటివి వారు నిర్వహిస్తూ ఉంటారు. ఆగస్టు 5న రిలీజ్ అయిన ‘బింబిసార’ ‘సీతా రామం’ వంటి చిత్రాలు ఆగస్టు 5న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించాయి. సక్సెస్ మీట్ లు కూడా జరుపుకున్నాయి. అయితే ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ 3,4 రోజుల కలెక్షన్స్ కే సంబరాల జరుపుకోకూడదంటూ…సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
ఆయన ఈ రెండు చిత్రాలు గురించి స్పందిస్తూ.. ” ‘సీతా రామం’ మూవీ అద్భుతమైన ప్రేమ కావ్యం. ఫస్ట్ హాఫ్‌లో కశ్మీర్ పండితుల సమస్యను నిజాయితీగా చూపించారు. అలాగే హిందూ ముస్లిం వంటి అంశాలను తీసుకుని అద్భుతమైన ప్రేమ చిత్రంగా మలిచాడు దర్శకుడు. ఓ అనాథను జావాన్‌గా చూపించడం మంచి కాన్సెప్ట్. ఇలాంటి సున్నితమైన ఎన్నో సమస్యలు తీసుకుని మంచి సినిమాగా తీర్చిదిద్దిన దర్శకుడిని కచ్చితంగా అభినందించాల్సిందే. ఇక ‘బింబిసార’ విషయానికి వస్తే.. ఇది రెగ్యులర్ కమర్షియల్ కథే. కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు వశిష్ట్ ఈ మూవీని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు.
టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమా కథా అని దీనిని ‘ఆదిత్య 369’ తో పోల్చి చూడడం కరెక్ట్ కాదు. ఆ సినిమాకి, ఈ సినిమాకి అస్సలు పోలీకే లేదు.బింబిసారుడు అనే కఠినమైన రాజు కథను తీసుకుని టైం ట్రావెలర్‌లో ఆ రాజు సున్నితంగా ఎలా మారాడో అనేది చూపించి ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరించడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకుండా, సినిమా ఎక్కువ రోజులు థియేటర్లో నిలబడేలా చూడాలి.
50 రోజుల పాటు సినిమాలు ఎందుకు ఆడటం లేదు? అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు.. ఇలాంటి విషయాల పై కూడా దృష్టి పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది.అలాంటి విషయాలపై దృష్టి పెట్టినప్పుడే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి, థియేటర్లను బ్రతికిస్తాయి. సినిమాకు పూర్వ వైభవం తప్పకుండా వస్తుంది’ అంటూ తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.