Thank You Trailer: ఆకట్టుకుంటున్న ‘థాంక్యూ’ ట్రైలర్… ఆ డైలాగ్ సమంత పై సెటైరా?

నాగ చైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. జూలై 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీకి బి.వి.ఎస్ రవి కథ అందించడం విశేషం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, మారో మారో, వంటి పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

ఆ ట్రైలర్ విషయానికి వస్తే…’మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువుండదు అని మా ఫ్రెండ్ చెప్పాడు’ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ ట్రైలర్ లో హీరో లైఫ్ ను మూడు స్టేజి లుగా చూపించారు. అయితే లైఫ్ లో సక్సెస్ అయిన తర్వాత అదంతా తన స్వయం కృతం అని భావించే హీరో .. ఓ సందర్భంలో మంచి మనిషిగా మారి..తన లైఫ్ లో సాయం సాధించడానికి కారణం అయిన వాళ్లకు థాంక్స్ చెప్పడానికి వెళ్తాడు. ఆ ప్రయాణమే ఈ చిత్రం కథ అని తెలుస్తుంది.

‘ఫ్లైట్ ఎక్కడమే ఫస్ట్ టైం చిన్నప్పుడంతా నారాయణపురం’ అనే డైలాగ్ ఫన్నీగా ఉండగా… ‘ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది’ అనే డైలాగ్ చైతన్య నిజజీవితానికి దగ్గరగా సమంత పై సెటైర్ వేసినట్టు ఉంది.

‘లుక్ బ్యాక్ అభి.. నీ సక్సెస్ కి కారణమైన వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అనే డైలాగ్ కూడా బాగుంది. ట్రైలర్ బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి:

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus