Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » మలయాళ హిట్‌ సినిమాతో తరుణ్‌ భాస్కర్‌ – ఈషా.. ఏ సినిమా అంటే?

మలయాళ హిట్‌ సినిమాతో తరుణ్‌ భాస్కర్‌ – ఈషా.. ఏ సినిమా అంటే?

  • April 20, 2024 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మలయాళ హిట్‌ సినిమాతో తరుణ్‌ భాస్కర్‌ – ఈషా.. ఏ సినిమా అంటే?

మలయాళ సినిమాలు ఇప్పుడు ఫుల్ జోష్‌ మీదున్నాయి. వరుసగా రూ. వంద కోట్లు మార్కును టచ్‌ చేస్తున్నాయి. ఒక మంచి సినిమా వచ్చింది అని తెలియగానే మనవాళ్లు కూడా మలయాళంలోనే చూసేస్తున్నారు. థియేటర్‌లో కాకపోయినా ఓటీటీలో అయినా చూసేస్తున్నారు. అలా ఓటీటీలో తెగ చూసేసిన ఓ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ‘జయ జయ జయ జయ హే’ సినిమానే ఇప్పుడు రీమేక్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘జయ జయ జయ జయ హే’ సినిమాలో దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran) , బాసిల్ జోసెఫ్ (Basil Joseph) ప్రధాన పాత్రలు పోషించారు.

విపిన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమానే ఇప్పుడు తెలుగులో ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ ఇండియా రీమేక్‌ చేస్తున్నాయి. ఏఆర్ సజీవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా ఈషా రెబ్బా (Eesha Rebba) నటిస్తోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ‘జయ జయ జయ జయ హే’ సినిమాను దర్శకుడు ఏఆర్‌ సజీవ మార్పులు చేసినట్లు చెబుతున్నారు. త్వరలో సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెనెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 మై డియర్ దొంగ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మార్కెట్ మహాలక్ష్మీ సినిమా రివ్యూ & రేటింగ్!

తరుణ్ భాస్కర్‌కి నటనపై ఆసక్తి ఎక్కువే. ఓవైపు సినిమాలు డైరెక్ట్‌ చేస్తూనే.. నటిస్తున్నారు కూడా. అలా ఇప్పుడు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమహేంద్రవరంలో జరుగుతోంది. అక్టోబరులో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. సినిమా కథేంటంటే… జయభారతి (దర్శన రాజేంద్రన్‌) స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. ఇంటర్‌ తర్వాత ఉన్నత చదువులు చదుకోవాలనుకుంటుంది.

ఎలాగోలా కుటుంబాన్ని ఒప్పించి డిగ్రీలో చేరుతుంది. అయితే, అక్కడ జరిగిన ఒక సంఘటన కారణంగా చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లయిన తర్వాత చదువును పూర్తి చేసి, ఉద్యోగం చేయాలన్నది ఆమె ఆశయం. అందుకు పెళ్లి చూపుల సమయంలో రాజేశ్‌ (బసిల్‌ జోసెఫ్‌) అంగీకరిస్తాడు. కానీ ఆ తర్వాత మాట మార్చేస్తాడు. చిన్న విషయానికే కోప్పడుతుంటాడు. కొన్నాళ్లు ఓపిక పట్టిన ఆమె… తర్వాత తిరగబడుతుంది. రాజేశ్‌ను జయ కొడుతున్న వీడియో వైరల్‌ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేదే కథ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jaya Jaya Jaya Jaya Hey

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

9 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

14 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

14 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

15 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

15 hours ago

latest news

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

2 days ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version