Bigg Boss 7 Telugu: ఫైనల్ డే టైటిల్ విన్నర్ తెలిసిపోయిందా..! అమర్ దీప్ కి ట్విస్ట్ ఇస్తున్నారా?

బిగ్ బాస్ విన్నర్ ఆల్ మోస్ట్ డిసైడ్ అయిపోయినట్లే. ఇంకా జస్ట్ ఒక్కరోజే ఓటింగ్ అనేది ఉంది కాబట్టి, భారీగా మార్పులు ఉండకపోవచ్చు. అన్ అఫిషియల్ ఓటింగ్ లెక్కల్లోకి వెళ్లితే.., పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ కి అన్ని చోట్ల కలిపి 33 శాతం యావరేజ్ గా ఓటింగ్ అనేది వచ్చింది. ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ టాప్ ఓటింగ్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో శివాజీ 26 పర్సెంట్ వరకూ ఓటింగ్ లో ఉన్నాడు. ఆ తర్వాత అమర్ దీప్ 24 పర్సెంట్ ఓటింగ్ తో ఉన్నాడు. వీళ్ల ముగ్గురే టాప్ 3లో కనిపిస్తున్నారు.

తర్వాత ప్లేస్ లో యావర్ 8శాతం ఓటింగ్ కి సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత ప్రియాంక 5 శాతం అర్జున్ 4 శాతం ఓటింగ్ ని పొందారు. ఇక టాప్ లో ఉన్న శివాజీకి అమర్ దీప్ కి ఇద్దరికీ సెకండ్ ప్లేస్ కోసం గట్టి పోటీ జరుగుతోంది. అంతేకాదు, ఓటింగ్ లో టాప్ లో ఉన్నా కూడా పల్లవి ప్రశాంత్ అఫిషియల్ లో ముందున్నాడు అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, ఇక్కడ మిస్డ్ కాల్ డేటా అనేది కీలకంగా మారబోతోంది. మరోవైపు ప్రియాంకకి అర్జున్ కి లాస్ట్ ప్లేస్ కి టఫ్ పైట్ ఉంది. వీరిద్దరిలో ముందు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా ఉత్కంఠంగానే మారింది.

అయితే, పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నట్లుగానే అఫీషియల్ పోలింగ్ లో ఉంటే కప్పు మనోడికి ఇచ్చి పంపించేస్తారు. మొక్కతో పాటుగా కప్పు కూడా ఇస్తారు. క్యాష్ ప్రైజ్, కార్, మనీ అన్నీ కూడా మనోడికే వచ్చేస్తాయి. రన్నరప్ అయిన వాళ్లకి ఎలాంటి క్యాష్ ప్రైజ్ ఉండదు. కేవలం వాళ్లకి రెమ్యూనిరేషన్ మాత్రమే దక్కుతుంది. ఒకవేళ పల్లవి ప్రశాంత్ ని ముందుగానే ఎలిమినేట్ చేస్తే., అప్పుడు శివాజీ ఇంకా అమర్ దీప్ ఇద్దరూ కూడా స్టేజ్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అప్పుడు వాళ్లిద్దరిలో పోలిస్తే శివాజీనే విన్నర్ గా నిలబెడతారు. మిస్డ్ కాల్ డేటా వెళ్లడం లేదని చాలామంది అన్నారు.

ఏది ఏమైనా ఈసారి విన్నర్ డిసైడ్ చేసేవరకూ కూడా ఏమీ చెప్పలేని పరిస్తితి. అయితే పల్లవి ప్రశాంత్ ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా విన్నర్ ఈసీజన్ విన్నర్ అతడే అవుతాడు. ఎందుకంటే, కామన్ మాన్ – సెలబ్రిటీ అని తేడా లేకుండా చాలా జెన్యూన్ గా ప్రైజ్ ఇచ్చినట్లుగా అవుతుంది. అప్పుడు మేబీ శివాజీ సెకండ్ ఉంటాడా.. లేదా అమర్ దీప్ ని తీస్కుని వచ్చి వాళ్లలో వాళ్లకే పోటీ పెడతారా అనేది చూద్దాం. ఇక యావర్ అయితే 4వ పొజీషన్ లో ఉన్నాడు.

మేబీ ఏదైనా మనీ సూట్ కేస్ 4గురు ఉన్నప్పుడు వస్తే యావర్ టెంప్ట్ అయితే యావర్ ఆడిన గేమ్ కి న్యాయం జరుగుతుందని అంటున్నారు చాలామంది. నిజానికి యావర్ ఫస్ట్ లో ఉన్నంత పవర్ చివర్లో చూపించలేకపోయాడు అనేది వాస్తవం. ఏదైనా క్యాష్ ప్రైజ్ వర్కౌట్ అయితే బాగుండని అందరూ భావిస్తున్నారు. అలాగే, ప్రియాంక అయితే ఫినాలేలో ఎలిమినేట్ అవ్వాల్సిందే. అలాగే అర్జున్ కూడా ముందుగానే ఎలిమినేట్ అవుతాడు. ఈసారి సెలబ్రిటీస్ ఎవరు రాబోతున్నారు (Bigg Boss 7 Telugu) ఫినాలే ఎలా ఉండబోతందనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus