Varun, Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమలో పడటానికి ఆయనే కారణమా?

టాలీవుడ్ మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ విషయం సంచలనంగా మారింది. వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాటి ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన వరుణ్ తేజ్ ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయలేదు అయితే తాజాగా వీరిద్దరి గురించి మరొక వార్త వైరల్ అవుతుంది.

వీరిద్దరికీ జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరగబోతుందని ఇప్పటికే నిశ్చితార్థానికి సంబంధించి పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం కూడా అందిందని సమాచారం. ఇక మెగా ఫ్యామిలీ ఈ నిశ్చితార్థ వేడుక ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలియడంతో వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి టాలీవుడ్ డైరెక్టర్ కారణమంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు శీను వైట్ల. ఈయన దర్శకత్వంలో వరుణ్ తేజ్ లావణ్య మొదటిసారిగా మిస్టర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఆ ప్రేమ వీరిద్దరిని పెళ్లి బంధం వైపు అడుగులు వేసేలా చేసిందని తెలుస్తుంది.

దీంతో వీరిద్దరూ ప్రేమ పెళ్లికి సీను వైట్ల కారణం అంటూ సోషల్ మీడియాలో ఈయన గురించి పలువురు మీమ్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ 2000 సంవత్సరంలో వచ్చిన ‘హేండ్సప్‌’ సినిమాతో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2014లో వచ్చిన ముకుంద సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus