పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని కామెంట్ వినిపిస్తున్నా పవన్ అభిమానులకు మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది. ఈ సినిమాతో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సక్సెస్ చేరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఏపీలోని నెల్లూరు జిల్లాలో రానా అభిమానులు టికెట్ల విషయంలో హర్ట్ అయ్యారని సమాచారం అందుతోంది. డిస్ట్రిబ్యూటర్లు రానా అభిమానులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తమకు టికెట్లు దక్కలేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో కేవలం ఐదు టికెట్లను డిస్ట్రిబ్యూటర్లు మా మొహాన కొట్టారంటూ రానా అభిమానులు మండిపడుతున్నారు. అరణ్య సినిమా రిలీజైన సమయంలో తాము ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున టికెట్లను బల్క్ గా కొనుగోలు చేశామని అలా చేయడం ద్వారా థియేటర్ల ఓనర్లకు నష్టం రాకుండా చూశామని రానా అభిమానులు చెబుతున్నారు.
అలాంటి తమకు ఇప్పుడు అన్యాయం జరుగుతోందని రానా ఫ్యాన్స్ చెబుతున్నారు. భీమ్లా నాయక్ సినిమాకు ఏపీలో బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు అనుమతులు దక్కలేదనే సంగతి తెలిసిందే. ఈ రీజన్ వల్లే ఫ్యాన్స్ మధ్య టికెట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. భీమ్లా నాయక్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రాధేశ్యామ్ రిలీజయ్యే వరకు ఈ సినిమాకు పోటీ లేదనే చెప్పాలి. వచ్చే వారం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదలవుతున్నా ఆ సినిమాకు మరీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప భీమ్లా నాయక్ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!