Bigg Boss Elimination: మూడోవారం బిగ్ బాస్ హౌస్ నుంచీ బయటకి ఎవరు వస్తున్నారో తెలుసా..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో మూడోవారం నామినేషన్స్ అనేవి చాలా ఆసక్తికరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఏకంగా ఈసారి 12మంది నామినేషన్స్ లోకి వచ్చారు. సీనియర్స్ జూనియర్స్ అని తేడా లేకుండా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మొదటి వారం ముమైత్ ఖాన్, రెండోవారం శ్రీరాపక హౌస్ నుంచీ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మూడోవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Click Here To Watch Now

అన్ అఫీషియల్ ఓటింగ్ ని మనం ఒక్కసారి చూసినట్లయితే.., అఖిల్ ఇంకా బిందుమాధవి ఇద్దరికీ టఫ్ ఫైట్ జరిగింది. ఇద్దరూ కూడా టాప్ పొజీషన్ కోసం పోటీ పడ్డారు. అయితే, అఖిల్ కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్ తో టాప్ 1లో ఉన్నాడు. ఆ తర్వాత టాప్ 2లో బిందుమాధవి ఉంది. వీరిద్దరూ అయితే ఖచ్చితంగా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఆ తర్వాత యాంకర్ శివ , అరియానా గ్లోరీ ఇద్దరూ కూడా సేఫ్ లోనే ఉన్నారు.

మూడు, నాలుగు ప్లేస్ లలో వీరిద్దరూ కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ లో వెనకబడ్డారు కానీ, ఏదైనా టాస్క్ ఆడితే మాత్రం ఖచ్చితంగా వీళ్లకి ఒక రేంజ్ ఎలివేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత హమీదా, మహేష్ విట్టా ఇద్దరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. టాప్ 5, టాప్ 6లో వీరిద్దరూ ఉన్నారు. ఆరుగురు అయితే సేఫ్ జోన్ లోనే కనిపిస్తున్నారు. ఇక మిగతా ఆరుగురు కొద్దిగా డేంజర్ జోన్ లో ఉన్నారు. బోటమ్ సిక్స్ మనం చూసినట్లయితే, నటరాజ్ మాస్టర్, ఇంకా తేజస్వి, ఆర్జే చైతూ ఈ ముగ్గురూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు.

ఈ ముగ్గురికీ దాదాపుగా ఒకేలా ఓటింగ్ అనేది జరుగుతోంది. గేమ్ లో ఎంత జెన్యూన్ గా ఉన్నా ఈసారి సోషల్ మీడియా ఫాలోయింగ్ వల్లే ఓటింగ్ అనేది జరుగుతోంది. ఫాలోవర్స్ ఉన్నవాళ్లు సేఫ్ అవుతున్నారు. లేదంటే మాత్రం ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇక లాస్ట్ లో అజయ్, మిత్రాశర్మ, ఇంకా స్రవంతి ఈ ముగ్గురూ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్లలో అమ్మాయిల్లో ఎలిమినేషన్ అనేది జరిగితే మిత్రాశర్మా, లేదా స్రవంతి ఈ ఇధ్దరిలోనే జరుగుతుంది.

లేదా, వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అవుతున్నారు కదా, ఈసారి అబ్బాయిల్లో ఒకర్ని ఎలిమినేట్ చేయాలి అనుకుంటే మాత్రం అజయ్ ని ఎలిమినేట్ చేస్తారు. ఏది ఏమైనా ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ నే ఎలిమినేట్ చేసేలా కనిపిస్తున్నారు. సో, స్రవంతి, లేదా మిత్రా శర్మా వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అదీ మేటర్.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus