Aadikeshava: ఆదికేశవ సినిమాని ఆ మెగా హీరోనే రిజెక్ట్ చేశారా?

డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ శ్రీ లీల జంటగా నటించిన తాజా చిత్రం ఆది కేశవ. సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కమర్షియల్ గా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ల ద్వారా భారీగానే సినిమాపై అంచనాలను పెంచేశారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు టీజర్ చూస్తే కనుక సినిమా భారీ స్థాయిలోనే ఉండబోతుందని అనిపించింది. మరి ఈ సినిమా కలెక్షన్ల ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమా కథ రాసే సమయంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా కథ రాయలేదట మరో మెగా హీరోని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథ రాశారని ఈ సినిమా కథ రాయడం పూర్తి అయిన తర్వాత శ్రీకాంత్ ఆ హీరో వద్దకు వెళ్లగా ఏ కారణం చేతనో ఆ హీరో రిజెక్ట్ చేయడంతోనే ఈ అవకాశం వైష్ణవ్ కి వచ్చిందని తెలుస్తోంది. మరి ఈ (Aadikeshava) సినిమాని రిజెక్ట్ చేసిన ఆ మెగా హీరో ఎవరు అనే విషయానికి వస్తే…

ఈ సినిమా కథను విన్న తర్వాత రిజెక్ట్ చేసిన మెగా హీరో మరెవరో కాదు వరుణ్ తేజ్. ముందుగా శ్రీకాంత్ ఈయనకి ఈ సినిమా కథను వినిపించారట అయితే ఆయన సినిమా కథ నచ్చక రిజెక్ట్ చేశారా లేక వ్యక్తిగత కారణాలవల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేశారో తెలియదు కానీ వరుణ్ రిజెక్ట్ చేయడంతోనే ఈ సినిమా కథ మరే ఇతర హీరోలకు వెళ్లకుండా తిరిగి మెగా హీరో వైష్ణవ్ తేజ్ వద్దకు వెళ్లి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus