ప్రభాస్ ఖాతాలో మరో ఘనత.. సంతోషంలో ఫ్యాన్స్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ బాహుబలి, బాహుబలి2 సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుని ప్రస్తుతం తెలుగులో ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నారు. ఆర్మాక్స్ సర్వే అక్టోబర్ ఫలితాలు వెల్లడి కాగా ఈ జాబితాలో ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలవడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. 2023లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ వేగంగా సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్ ప్రశంసలను సొంతం చేసుకుంటున్నారు.

మోస్ట్ పాపులర్ టాలీవుడ్ స్టార్స్ జాబితాలో ప్రభాస్ కు తొలి స్థానం దక్కడంతో ప్రభాస్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ గత సినిమాలు ఫ్లాపైనా నిర్మాతలు, బయ్యర్లు ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని చెబుతున్నారు. ప్రభాస్ తొలి స్థానంలో నిలిస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ పొజిషన్ లో నిలిచారు. బన్నీ, మహేష్, చరణ్ 3,4,5 స్థానాలలో నిలవడం గమనార్హం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. నాని, విజయ్ దేవరకొండ 7,8 స్థానాలలో నిలవగా చిరంజీవి, వెంకటేష్ 9, 10 స్థానాలలో నిలిచారు. ప్రభాస్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉండగా మరో అరుదైన రికార్డ్ చేరడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది. గతంలో కూడా ప్రభాస్ పలు సర్వేలలో నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ప్రభాస్ సినిమాలన్నీ 300 కోట్ల రూపాయలను మించిన బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ప్రభాస్ సినిమాల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. సినిమాసినిమాకు ప్రభాస్ మార్కెట్ పెరుగుతోంది. ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతుండగా ఈ ప్రాజెక్ట్ లు ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాలుగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus