(Mahesh Babu) సినిమా ఇండస్ట్రీలో రికార్డ్స్ అనేవి టెంపరరీ.. ఎందుకంటే ఇప్పుడొక స్టార్ రికార్డ్ క్రియేట్ చేస్తే.. మరో మూవీతో ఇంకో స్టార్ దాన్ని బీట్ చేస్తాడు.. ఒకప్పుడు ఈ రికార్డుల హంగామా వేరుగా ఉండేది.. 50, 100, 150, 175, 200 డేస్.. ఆ తర్వాత 365, 500 డేస్ ఇంకా బీభత్సం అంటే ఏకంగా ఏడాది పాటు ఆడిన సినిమాలున్నాయి.. చాలా గ్యాప్ తర్వాత బాలయ్య ‘లెజెండ్’ ఫిలిం 1000 రోజులాడి సాలిడ్ రికార్డ్ నెలకొల్పింది..
ఇప్పుడంతా ఫస్ట్ డే కలెక్షన్స్, ఓవర్సీస్ మిలియన్ మార్క్, వందల, వేల కోట్లు లెక్కలే.. రెండు వారాలు, మహా అయితే నాలుగు వారాల పాటు థియేట్రికల్ రన్ అంటే గగనం.. పైగా ఈమధ్య కాలంలో రీ రిలీజ్‌లు, స్పెషల్ షోల సందడి కూడా మొదలైంది.. కానీ ఇప్పటికీ ఓ రేర్ రికార్డ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మీదనే ఉంది.. ‘దూకుడు’ మూవీలో ‘దిస్ ఈజ్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్..
దిస్ ఈజ్ ఆల్ టైం రికార్డ్’ అని చెప్పినట్టు ఈ రికార్డ్ సూపర్ స్టార్ పేరిట పర్మినెంట్ రికార్డ్ అన్నమాట.. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పుడంటే స్టార్ హీరో నటించిన ఒక పెద్ద సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా, అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు కానీ అప్పట్లో ఫస్ట్ సెట్ రిలీజ్, సెకండ్ సెట్ రిలీజ్ అని ఉండేవి.. అలా సెకండ్ సెట్‌లో హయ్యెస్ట్ థియేటర్స్‌లో రిలీజ్ అయిన మూవీ ‘పోకిరి’..
అప్పటికే వసూళ్లు పరంగా.. డేస్ (365 & 500) సెన్సేషనల్ రికార్డ్స్ సెట్ చేసిన ఈ ఇండస్ట్రీ హిట్ ఫిలిం.. సెకండ్ సెట్‌లో ఏకంగా 130 థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. ఇప్పుడు రీ రిలీజులు చేసినా, స్పెషల్ షోలు వేసినా ఇన్ని స్క్రీన్స్ లేవు.. ఆ లెక్కన అప్పటికీ, ఇప్పటికీ ఈ రికార్డ్ చె