Star Hero: వామ్మో ఆ హీరో అంత రెమ్యునరేషన్ తీసుకునేవారా?

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ అవ్వగానే రెమ్యునరేషన్లు ఒక్కసారిగా పెంచేస్తుంటారు. ఇక అప్పట్లో స్టార్ హీరోలకు ఒక సినిమాకు రూ. 10 లక్షలు రెమ్యునరేషన్ ఇస్తే వామ్మో అని అనుకుంటూ ఉండేవారు. అయితే 1990వ దశకం నుంచి క్రమక్రమంగా హీరోల రెమ్యునరేషన్లు పెరిగిపోతూ వచ్చాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న హీరోలు కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటే అప్పటి స్టార్ హీరోలు ఎంత తీసుకున్నారో ఒక్కసారి చూద్దామా. తెలుగు ఇండస్ట్రీ మూలపురుషుడు ఎన్టీఆర్‌ అప్పట్లో సినిమా చేయాలంటే రూ. 40 లక్షలు బడ్జెట్ లో ఉండేదంట.

ఆ సినిమాని సెట్స్ వేసి.. కాస్త భారీగా తీయాలంటే మరో రూ. 10 లక్షల వరకు అయ్యేదంట. ఇక అందుకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రూ. 12 లక్షల వరకు ఉండదని సమాచారం. ఆయన పారితోషికంలాగే సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అప్పట్లోనే రూ. కోటి నుంచి రూ. 3 కోట్ల వరకు వసూళ్లు రాబట్టేవాని సమాచారం. అలాగే ఇండస్ట్రీకి మరో మూలపురుషుడు ఏఎన్నార్‌ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన సాంఘీక సినిమాలకు బడ్జెట్ రూ. 30 కోట్లు ఉండగా..

ఏఎన్నార్ రెమ్యునరేషన్ రూ. 10 లక్షలు తీసుకునేవారంట. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండేవారని సమాచారం. ఇక ఆయన సినిమా బడ్జెట్ 20 నుంచి 25 లక్షల వరకు ఉంటే అందులో ఆయన 7 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేవారంట. అయితే కృష్ణ తన సినిమా ప్లాప్ అయ్యి.. నిర్మాతలకు నష్టాలు వస్తే వెంటనే అదే నిర్మాతలకు కృష్ణ డేట్లు ఇచ్చి మరో సినిమా చేసి పెట్టేవారాని చెబుతుంటారు.

అంతేకాక (Star Hero) కృష్ణని నిర్మాత హీరో అని కూడా అంటుండేవారు. ఇక వెండితెర సోగ్గాడు శోభన్‌బాబు సినిమా బడ్జెట్ రూ. 20 లక్షలు అయితే అందులో రూ. 6-7 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకునేవారని సమాచారం. మరో హీరో సుమన్ కూడా రూ.3లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారని సమచారం. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా రూ.3నుంచి 4లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారు. పసివాడిప్రాణం సినిమా తరువాత చిరంజీవి రెమ్యునరేషన్ భారీగా పెరిగిందని వార్తలు వచ్చాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus