ఆ స్టార్ హీరోయిన్ రాజేంద్ర ప్రసాద్ సినిమాలో బాలనటిగా నటించిందా..!

కొన్నేళ్ల క్రితం బాలనటిగా నటించి తరువాత కాలంలో సడన్ గా హీరోగాను, హీరోయిన్ గాను ఏంట్రీ ఇస్తుంటారు. అలా సినిమా ఇండ్రస్ట్రీలో చాలామంది నటులే ఉన్నారు. అలా ఈ క్రింది ఫోటో లో కనిపిస్తున్న ఈ చిన్న అమ్మాయి నేడు సౌత్ లో పెద్ద హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్య రాజేష్. ఈమె బాలనటిగా ప్రముఖ హీరో రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘రామ బంటు’ అనే చిత్రంలో నటించింది.

ఈ సినిమాకి బాపు దర్శకత్వం వహించాడు. చూసేందుకు పిచ్చి పిల్ల లాగ కనిపిస్తున్న ఈ అమ్మాయి పెద్దయిన తర్వాత ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఈమె అప్పటి హీరో రాజేష్ కి కుమార్తె. అందుకే పలు సినిమాల్లో బాలనటిగా నటించే అవకాశం దక్కింది అని ఐశ్వర్య రాజేష్ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది.

ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) తెలుగు లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయ్యుండొచ్చు. కానీ ఆ తక్కువ సినిమాలతోనే ఆమె నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఈమె ఫిల్మోగ్రఫీ మొత్తం అత్యధికంగా తమిళం లోనే ఉంటుంది. అందం తో కాకుండా కేవలం నటనతో ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉండే అరుదైన హీరోయిన్స్ లో ఒకరిగా ఐశ్వర్య రాజేష్ నిల్చింది.

కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఐశ్వర్య రాజేష్ తో వెబ్ సిరీస్ లు చెయ్యడానికి కూడా అమితాసక్తిని చూపిస్తున్నారు మేకర్స్. అలా ఒక పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్ లతో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్న ఐశ్వర్య రాజేష్ ఏడాదికి 20 కోట్ల రూపాయిల వరకు సంపాదిస్తుంది అట. సౌత్ లో ఈ రేంజ్ డిమాండ్ తో కొనసాగుతున్న హీరోయిన్లు చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. రాబొయ్యే రోజుల్లో ఈమె ఇంకా ఎంత రేంజ్ కి వెళ్తుందో చూడాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus