కరోనా బారిన పడిన మరో నటి

నటులపై కరోనా పంజా విసురుతుంది. కొద్దిరోజుల క్రితం ఇద్దరు బుల్లితెర నటులు ప్రభాకర్ మరియు హరికృష్ణ లకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం షూటింగ్స్ మొదలు కాగా… కొన్ని సీరియల్ షూటింగ్స్ లో వారు పాల్గొన్నారు. దీనితో వారు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో బుల్లి తెర నటికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ తేలింది. ‘నా పేరు మీనాక్షి’ మరియు ‘ఆమె కథ’ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న నవ్య స్వామి వైరస్ బారిన పడ్డట్లుగా తెలుస్తోంది.

కరోనా వైరస్ లక్షణాలతో ఆమె బాధపడుతుండగా కోవిడ్ నిర్థారణ పరీక్షకు వెళ్లగా అక్కడ పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆమెకు కరోనా నిర్ధారణ అయిన వెంటనే కోరంటైన్ చేయడంతో పాటు, చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఇక ఆమె పాల్గొన్న సీరియల్స్ షూటింగ్ టీం సభ్యులు అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారట. షూటింగ్స్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మళ్ళీ షూటింగ్స్ కి బ్రేక్ పడింది. బడా చిత్రాల దర్శక నిర్మాతలు, హీరోలు షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు.

రజని కాంత్ అంతటి హీరోనే 2020 ముగిసే వరకు షూటింగ్స్ లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు. ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ సైతం బయటపడకున్నా అదే నిర్ణయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి ఇప్పట్లో మొదలయ్యేలా లేదు.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus