మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ తరువాత ఎందుకో రీమేకులపై పడ్డారు. వరుసగా ఆయన రీమేక్ చిత్రాలు ప్రకటిస్తున్నారు. రాజకీయాల కోసం ఓ దశాబ్దం పాటు చిరంజీవి పాక్షికంగా వెండితెరకు దూరం అయ్యారు. 2007లో వచ్చిన శంకర్ దాదా మూవీ తరువాత ఆయన 2017లో వచ్చిన ఖైదీ 150 చిత్రంతో తిరిగి అరంగేట్రం చేశారు. మధ్యలో అడపాదడపా క్యామియో రోల్స్ చేసినా, ఆయన పూర్తి స్థాయిలో అరంగేట్రం చేసింది మాత్రం ఖైదీ 150 చిత్రంతోనే. కాగా ఆ చిత్రం కూడా రీమేక్ కావడం విశేషం.
దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో హీరో విజయ్ చేసిన తమిళ చిత్రం కత్తికి రీమేక్ గా ఈ మూవీ రావడం జరిగింది. దర్శకుడు వి వి వినాయక్ ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ మంచి హిట్ ఇచ్చారు. గతంలో కూడా మురుగదాస్ తెరకెక్కించిన తమిళ్ చిత్రాన్ని వీరు ఠాగూర్ పేరుతో తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. కాగా ప్రస్తుతం కొరటాల మూవీ తరువాత చిరు రెండు రీమేక్ లో నటించనున్నారు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేకక్ హక్కులు దక్కించుకున్న కొణిదెల ప్రొడక్షన్స్ దక్కించుకుంది. దర్శకుడు సుజీత్ ఈ స్క్రిప్ట్ పై పనిచేస్తున్నారు.
అలాగే తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ తో మరో రీమేక్ దాదాపు ఖరారు చేశారు. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వచ్చిన వేదాళం మూవీ రీమేక్ లో కూడా ఆయన నటించనున్నారు. హీరో అజిత్ నటించిన ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. సుజీత్ తయారు చేసిన లూసిఫర్ స్క్రిప్ట్ పై చిరంజీవి సంతృప్తిగా లేరని ప్రచారం జరుగుతుండగా, మొదట ఆయన ఈ రెండింటిలో ఏ మూవీ రీమేక్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. చిరంజీవి మొదట లూసిఫర్ చేసేది, వేదాళం చేసేది, చిరు బర్త్ డే అయిన ఆగస్టు 22న తెలియనుంది.a