వారానికి నాలుగైదు చెప్పుకోదగ్గ సినిమాలు, మరికొన్ని పేరు సైతం తెలియని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి డబ్బింగ్ సినిమాలు, తెలుగు సినిమాలను డామినేట్ చేసి హిట్ అవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. ఈవారం (ఏప్రిల్ 25) కూడా రీరిలీజులతో కలిపి దాదాపుగా 14 సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో చెప్పుకోదగ్గవి సారంగపాణి జాతకం, చౌర్య పాఠం. వాటితోపాటుగా మలయాళంలో ఘన విజయం సొంతం చేసుకున్న “అలప్పుజ జింఖానా” డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ అవుతుంది.
సదరు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించారు. హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఈవెంట్ చాలా సింపుల్ గా గంటలో ముగిసిపోయింది. అయితే.. ఈ ఈవెంట్ కి సడన్ ఎంట్రీ ఇచ్చిన మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి (Sashi) మాట్లాడిన ఓ మాట, ఈవారం విడుదలవుతున్న సినిమాలను తక్కువ చేసినట్లుగా అయ్యింది. ఆయన స్పీచ్ లో శశి మాట్లాడుతూ.. “ఈ ఏప్రిల్ 25కి రిలీజులు కూడా ఏమీ లేవు, ఉన్నవాటిలో ఇదే బెటర్ సినిమా అని మేం అనుకుంటున్నాం” అనడం ఎందుకో రుచించలేదు.
మిగతా సినిమాలతోపాటుగా అలప్పుజ జింఖానా కూడా బాగా ఆడాలి అని చెప్పుంటే ఇంకాస్త బాగుండేది. ఎందుకంటే.. కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన ప్రియదర్శి హీరోగా వస్తున్న “సారంగపాణి జాతకం” మీద మంచి అంచనాలే ఉన్నాయి, “చౌర్య పాఠం” రీసెంట్ ప్రెస్ మీట్ తర్వాత మినిమం బజ్ క్రియేట్ చేయగలిగింది.
“అలప్పుజ జింఖానా” కచ్చితంగా హిట్ సినిమానే, తెలుగులో కూడా హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ.. ఇలా సభా ముఖ్యంగా ఓ డబ్బింగ్ సినిమాని హైలైట్ చేస్తూ, స్ట్రయిట్ తెలుగు సినిమాలను తక్కువ చేసిన మాట్లాడడం అనేది మాత్రం మంచిది కాదు. డిస్ట్రిబ్యూటర్ గా విశేషమైన అనుభవమున్న శశి మరోసారి ఈ తరహా స్టేట్మెంట్స్ ఇవ్వరు అని ఆశిద్దాం.
ఈ ఏప్రిల్ 25కి రిలీజులు కూడా ఏమీ లేవు, ఉన్నవాటిలో ఇదే బెటర్ సినిమా.. Mythri Distributor #Sashi
డబ్బింగ్ సినిమా కోసం తెలుగు సినిమాల్ని తక్కువ చేయాలా? pic.twitter.com/eoHj21P25B
— Filmy Focus (@FilmyFocus) April 23, 2025