Nicholai Sachdev: వరలక్ష్మీ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు!
- March 5, 2024 / 10:50 AM ISTByFilmy Focus
వరలక్ష్మీ శరత్ కుమార్ సడన్ గా నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి ఆమె అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చింది. నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో ఈమె ఎంగేజ్మెంట్ జరిగింది. నికోలాయ్ సచ్ దేవ్ గ్యాలరిస్ట్ అని ప్రకటించారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వరలక్ష్మి, నికోచాయ్ లకు గత 14 సంవత్సరాలుగా స్నేహితులు అని తెలుస్తుంది.ఇక వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో నికోలాయ్ సచ్ దేవ్ (Nicholai Sachdev) గురించి నెటిజెన్లు సోషల్ మీడియాలో ఎక్కువగానే సెర్చ్ చేస్తున్నారు. అతను ఎవరు? ఏం చేస్తుంటాడు? సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తా? కాదా? అనే డిస్కషన్లు ఇప్పుడు ముమ్మరంగా జరుగుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నికోలయ్ సచ్‌దేవ్. ముంబైకు చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తుంది. తను ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతున్నాడట. ఆన్లైన్లో ఇతని పెయింటింగ్‌లు, కళాకృతుల విక్రయం జరుగుతుందట.

అయితే వరలక్ష్మి శరత్‌కుమార్‌తో నిశ్చితార్థం అయితే కానీ ఈ విషయాలు బయటకి రాలేదు. ఈ ఏడాది చివర్లో నికోలయ్- వరలక్ష్మీ..ల వివాహం జరగనుందని సమాచారం. మరోపక్క వరలక్ష్మీ కూడా గతంలో విశాల్ తో ప్రేమాయణం నడిపినట్టు ప్రచారం జరిగింది. ఓ దశలో విశాల్ తో ఈమె పెళ్లి ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ నడిగర్ సంఘం రాజకీయాలు వీరిని వేరు చేసినట్టు చాలా మంది చెప్పుకున్నారు.
‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!
నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!
















