ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ వచ్చింది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో 2023 డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్నా, పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించినా, సినిమా పై మాత్రం మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది.
దీంతో మొదటి వారం అద్భుతంగా కలెక్ట్ చేసింది. అయితే హిందీలో పోటీగా షారుఖ్ ఖాన్ ‘డంకీ’ రిలీజ్ అవ్వడంతో పెద్ద టార్గెట్ అయితే సెట్ చేయలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
77.06 cr
సీడెడ్
22.21 cr
ఉత్తరాంధ్ర
17 cr
ఈస్ట్
10.02 cr
వెస్ట్
7.11 cr
గుంటూరు
9.27 cr
కృష్ణా
7.40 cr
నెల్లూరు
4.77 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
148.84 cr
కర్ణాటక
22.65 cr
తమిళనాడు
11.47 cr
హిందీ
65 cr
కేరళ
6.89 cr
ఓవర్సీస్
64.5 cr
రెస్ట్
6.7 cr
టోటల్ వరల్డ్ వైడ్
326.05 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ (Salaar) చిత్రానికి రూ.336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.338 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.326.05 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. రూ.11.95 కోట్ల నష్టాలతో అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది ఈ మూవీ.