పరవాలేదనిపించుకున్న 2018 ఫస్ట్ హాఫ్

  • July 2, 2018 / 08:07 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమకి 2017 బాగా కలిసి వచ్చింది. ఖైదీ నంబర్ 150 , బాహుబలి కంక్లూజన్, అర్జున్ రెడ్డి, ఫిదా.. ఇలా ఎన్నో విజయాలను అందించింది. ఇక 2018 మొదలై అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. అంటే ఇయర్ లో ఫస్ట్ హాఫ్ పూర్తయిపోయిందన్నమాట. మరి ఎలా సాగిందో తెలుసుకుందాం. ఈ సంక్రాంతికి వచ్చిన పవన్‌కల్యాణ్‌ “అజ్ఞాతవాసి”, బాలకృష్ణ “జైసింహా”, రాజ్‌తరుణ్‌ “రంగులరాట్నం” సినిమాలు రిలీజ్ కాగా, జైసింహా ఎంతోకొంత లాభాలను తెచ్చిపెట్టింది. ఇక తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన “భాగమతి”, “ఛలో” సినిమాలు భారీ కలక్షన్స్ రాబట్టాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన రవితేజ టచ్‌ చేసి చూడు, గాయత్రి,

సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్‌ సినిమాలు మొదటిరోజే చతికిలపడ్డాయి. గత ఏడాది ఫిదాతో హిట్ కొట్టిన వరుణ్ ఈసారి ఫిబ్రవరిలో తొలిప్రేమ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక నాని నిర్మించిన విభిన్నమైన ‘అ!’ విమర్శకుల ప్రసంశలు అందుకుంది. రామ్ చరణ్ “రంగస్థలం” సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ సాధించింది. మహేష్‌బాబు “భరత్‌ అనే నేను” సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. సావిత్రి జీవితంపై తెరకెక్కిన “మహానటి” అమోఘమైన సినిమాగా నిలిచింది. తాజాగా వచ్చిన “సమ్మోహనం” అందరి మనసులను గెలుచుకుంది. ఇక కల్యాణ్‌రామ్‌ “ఎమ్‌.ఎల్‌.ఎ”, నితిన్‌ “ఛల్‌ మోహన్‌ రంగ” నాని “కృష్ణార్జున యుద్ధం”, అల్లు అర్జున్‌ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా”, పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన “మెహబూబా”, రవితేజ “నేల టిక్కెట్టు”, నాగార్జున “ఆఫీసర్‌”, మంచు విష్ణు “ఆచారి అమెరికాయాత్ర” వంటి అనేక సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. మరి సెకండాఫ్ లోనైనా ఎక్కువ సినిమాలు హిట్ సాదిస్తాయోమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus