విక్రాంత్ వేద్, రాజా అశోక్ వల్లంశెట్టి, సమీర్ మల్లా, రాహుల్ చిలం, సాయి అరుణ్ పట్టపర్ల, రాజీవ్ కనకాల, ప్రమోదిని పమ్మి తదితరులు.. (Cast)
విస్కీ దాసరి (Director)
భరత్ ఇమ్మళ్లరాజు (Producer)
ప్రశాంత్ శ్రీనివాస్ జి.ఎస్ (Music)
రాహుల్ మాచినేని (Cinematography)
Release Date : జూలై 19, 2024
ఇండిపెండెంట్ సినిమా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ తరుణంలో కొందరు కొత్త కుర్రాళ్లు తమ టాలెంట్ ను నమ్ముకుని చేసిన రిస్క్ “బర్త్ డే బాయ్”. ఈ బృందం చేసిన ప్రమోషన్స్ సినిమాను అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యేలా చేశాయి. ఓ చిన్న సినిమాకి ఇది పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. ట్రైలర్ కూడా యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. మరి ఇప్పటివరకూ ముఖం చూపించకుండాని సినిమాను ప్రమోట్ చేసిన దర్శకుడు విస్కీ తెరకెక్కించిన “బర్త్ డే బాయ్” ఏ స్థాయిలో ఉంది అనేది చూద్దాం..!!
కథ: చదువుకోవడం కోసం అమెరికా వెళ్లి.. అక్కడ భీభత్సంగా ఎంజాయ్ చేస్తున్న నలుగురు ఫ్రెండ్స్, తన స్నేహితుల్లో ఒకడైన బాలు (విక్రాంత్ వేద్) పుట్టినరోజును కాస్త కొత్తగా సెలబ్రేట్ చేయడం కోసం చేసిన ప్లాన్ వికటించి బాలు మరణిస్తాడు. దెబ్బకి మిగతా స్నేహితులందరికీ ప్యాంట్లు తడిసిపోయి.. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో భరత్ (రవికృష్ణ)ను ఇంటికి పిలుస్తారు. అసలు బాలు ఎలా చనిపోయాడు? నిజంగా బర్త్ డే బంప్స్ ఇస్తుంటే చనిపోయాడా? లేక ఎవరైనా చంపారా? ఒకవేళ అలా చంపి ఉంటే అందుకు గల కారణం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “బర్త్ డే బాయ్” చిత్రం.
నటీనటుల పనితీరు: కీలకపాత్ర పోషించిన రవికృష్ణ తనదైన శైలి నటనతో భరత్ అనే పాత్రను పండించడానికి మరియు సినిమాను నడిపించడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఒక మేరకు విజయం సాధించాడు కూడా. అయితే.. కథకు కీలకమలుపైన ఈ తరహా పాత్రకు రవికృష్ణను ఎంపిక చేయడంతో సర్వసాధారణంగా ట్విస్ట్ ను ప్రేక్షకులు ముందుగానే ఊహించడానికి కారణంగా మారింది.
నలుగురు స్నేహితుల్లో బరువైన పాత్ర మణికి లభించినప్పటికీ.. చాలా ఈజ్ తో క్యారెక్టర్ ను పండించి అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రాజా అశోక్ వల్లంశెట్టి. చాలా నేచురల్ గా చేశాడు. రాహుల్ చిలం, సాయి అరుణ్ పట్టపర్ల, సమీర్ మల్లా తదితరులు పర్వాలేదనిపించుకున్నారు. రాజీవ్ కనకాల (Rajeev Kanakala) , ప్రమోదిని (Pramodini) తమ సీనియారిటీని నిరూపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: టెక్న్సీషియన్స్ లో ముందుగా మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ రాహుల్ మాచినేని పనితనాన్ని. సినిమా మొత్తం ఒక డూప్లెక్స్ ఇంట్లోని నడుస్తుంది. తిప్పికొడితే హాల్ & ఒక బెడ్రూం లోన్ సగానికి పైగా సన్నివేశాలు ఉంటాయి. అయితే.. ఎక్కడా కూడా ఫ్రేమ్స్ రిపీటెడ్ అనిపించలేదు. అయితే.. ఎమోషన్ కు తగ్గ లైటింగ్ తో ఆడియన్స్ ను సినిమాలో లీనమయ్యేలా చేసేందుకు శతవిధాల ప్రయత్నించాడు రాహుల్. ప్రశాంత్ శ్రీనివాస్ జి.ఎస్ బాణీలు ఆకట్టుకుకోలేదు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ & ఎండింగ్ బీజియం ఎఫెక్టివ్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ టీమ్ ను కూడా మెచ్చుకోవాలి. ఇండియాలో షూట్ చేసిన సినిమాను అమెరికాలో షూట్ జరిగినట్లుగా చిత్రించడంలో వాళ్లు వందశాతం విజయం సాధించారు.
దర్శకుడు విస్కీ దాసరి ఎంచుకున్న కథలో దమ్ము ఉంది.. తొలి 20 నిమిషాల్లో దాన్ని ప్రాజెక్ట్ చేస్తూ వచ్చిన విధానం కూడా బాగుంది. అయితే.. లొకేషన్ లిమిటేషన్స్ & కథనాన్ని కేవలం ఫోన్ కాల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బెడిసికొట్టింది. చాలా సీరియస్ సిచ్యుయేషన్ ను సింపుల్ గా సెటిల్ చేయడం అనేది మింగుడుపడదు. అలాగే.. సెకండాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్ బోర్ కొట్టించాయి. కథలోని ట్విస్టులను రివీల్ చేసిన విధానం బాగున్నప్పటికీ..
ఆ ట్విస్టులకు సరైన ఎమోషన్ తో ముడిపెట్టేలా చేయడంలో మాత్రం విఫలమయ్యాడు దర్శకుడు విస్కీ. ఓ కొత్త దర్శకుడు మంచి కటెంట్ & క్వాలిటీతో సినిమాను తెరకెక్కించినందుకు ఆ ప్రయత్నాన్ని మెచ్చుకొనేలా ఉన్నప్పటికీ.. ప్రయత్నంలో ఉన్న లోపాలు ఆ మెచ్చుకోలును దూరం చేశాయి. అయితే.. ఇదంతా నిజంగా జరిగిన విషయం అని టైటిల్ కార్డ్స్ లో “ఆర్ ఎక్స్ 100” తరహాలో ఫోటో వేయడం చిన్నపాటి గగుర్పాటును కలిగిస్తుంది. ఓవరాల్ గా.. విస్కీ దాసరి దర్శకుడిగా, కథకుడిగా బొటాబొటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
విశ్లేషణ: కొన్ని ఆలోచనలు పేపర్ మీద అద్భుతంగా ఉంటాయి, కానీ సినిమాగా తీయాలంటే మాత్రం కొంత నేర్పు అవసరం. అది లోపించడంతో ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వలేక, ట్విస్టులను ఎలివేట్ చేయలేక ఇబ్బందిపడిన చిత్రం “బర్త్ డే బాయ్”. అయితే.. బృందం చాలా లిమిటెడ్ బడ్జెట్ & సింగిల్ లొకేషన్ లో ఈస్థాయి క్వాలిటీ అవుట్ పుట్ అందించడం మాత్రం అభినందనీయం.
ఫోకస్ పాయింట్: ఫలితం దక్కని కష్టం “బర్త్ డే బాయ్”
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus