పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ సినిమాలో నటించబోయేది వీళ్లే..!

మెగా మామ – మేనల్లుడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ్ సూపర్ హిట్ ‘వినోదయ సితం’ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది.. వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేసి.. వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్.. వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తుండగా..

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు.. తంబి రామయ్య క్యారెక్టర్ సాయి తేజ్, సముద్రఖని రోల్ (దేవుడు) పవన్ చేస్తున్నారు.. తమిళ మూవీలో సాయి చేస్తున్న పాత్ర పెద్ద వయసున్నది.. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు..ఇక ఈ సినిమా కాస్టింగ్‌కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది టీమ్.. కీలకపాత్రలో నటించబోయే నటీనటుల వివరాలను వెల్లడించారు..

బ్రహ్మానందం, కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, రోహిణి, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు (సిరివెన్నెల సీతా రామ శాస్త్రి కొడుకు), సుబ్బరాజు తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేయనున్నారు.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలయజేయనున్నారు.. మెగా మామా అల్లుడు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు ప్రేక్షకాభిమానుల్లోనూ మంచి అంచనాలున్నాయి..

సాయి తేజ్ నటిస్తున్న ‘విరుపాక్ష’ గ్లింప్స్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా మంచి స్పందన లభించింది.. ఇప్పుడు టీజర్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మార్చి 1న విడుదల కానుంది.. ఇప్పటికే టీజర్ చూసి మూవీ టీంని పవన్ అభినందించారు.. టీం అంతా కష్టపడి పని చేసిన ‘విరూపాక్ష’ తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని పవన్ అన్నారు.. ‘రిపబ్లిక్’ వంటి డీసెంట్ రివల్యూషనరీ ఫిలిం తర్వాత తేజ్ చేస్తున్న చిత్రం ఇదే..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus