భీమ్లా నాయక్ లో మార్పులు ఎలా ఈ సినిమాల ద్వారా చేశారా?

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలయికలో సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ రీమేక్ గా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్.ఫిబ్రవరి 25 న విడుదలైన ఈ మూవీ మంచి ఫలితాన్నే అందుకుంది. టికెట్ రేట్ల ఇష్యూ నడుస్తున్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించేలా కలెక్ట్ చేసింది. త్రివిక్రమ్ ఈ మూవీకి కథ మాటల తో పాటు స్క్రీన్ ప్లేని కూడా అందించారు. ఇదిలా ఉండగా..

Click Here To Watch NOW

ఈ మూవీ క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్, రానా కి మధ్యలో ఓ ఫైట్ సీన్ ఉంటుంది. ఒరిజినల్ లో కూడా ఇద్దరి హీరోల మధ్య ఫైట్ సీన్ ఉంటుంది కానీ అది దెబ్బకు దెబ్బ అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ కాసేపు పవన్ కొడితే, కాసేపు రానా కొట్టడం, చివరికి పవన్ రానా ని చితక్కొట్టి చంపేయడానికి రెడీ అవ్వడం చూస్తాం. ఆ క్రమంలో రానా భార్య రావడం, గతంలో పవన్ కళ్యాణ్ కు ఆమెని చెల్లెలి లా భావించి..ఆమెకు ఓ మాట ఇవ్వడం గుర్తుకొచ్చి రానా ని వదిలేస్తాడు.

ఇదంతా ఒరిజినల్ లో ఉండదు. కానీ తెలుగులో ఇలాంటి క్లైమాక్స్ గతంలో రెండు సినిమాల్లో ఉండడాన్ని గమనించ వచ్చు. 2015 లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో కూడా ఇలాగే ఉంటుంది. అల్లు అర్జున్ కు ఉపేంద్ర కి మధ్యలో ఫైట్ ఉండడం, ఆ టైంలో ఉపేంద్ర .. బన్నీ ని చంపాబోతుంటే..అక్కడ వాళ్ళ అమ్మ పాత్ర ఎంట్రీ ఇస్తోంది. అలాగే అక్కడ కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది. అది గుర్తొచ్చి అల్లు అర్జున్ ను ప్రాణాలతో వదిలేస్తాడు.

అలాగే 2016 ఎండింగ్ లో కూడా ఇలాంటి క్లైమాక్స్ తో ఓ మూవీ వచ్చింది.అదే అప్పట్లో ఒకడుండేవాడు. ఈ మూవీలో శ్రీ విష్ణు, నారా రోహిత్ లు హీరోలు. ఈ మూవీ క్లైమాక్స్ కూడా భీమ్లా నాయక్ క్లైమాక్స్ కు దగ్గరగా ఉంటుంది. నారా రోహిత్, శ్రీ విష్ణు కొట్టుకోవడం… చివరికి శ్రీ విష్ణుని… నారా రోహిత్ చంపేయబోతుంటే.. గతంలో నారా రోహిత్ చెల్లిని శ్రీవిష్ణు కాపడినట్టు చిన్న ఫ్లాష్ బ్యాక్ విజువల్ చూపిస్తారు.

దాంతో నారా రోహిత్… శ్రీ విష్ణుని ప్రాణాలతో వదిలేస్తాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు, అప్పట్లో ఒకడుండే వాడు కి సాగర చంద్ర దర్శకుడు… భీమ్లా నాయక్ కి సాగర్ చంద్ర దర్శకుడు అయితే త్రివిక్రమ్ రిటైర్ అలాగే స్క్రీన్ ప్లేని అందించారు. అందుకే భీమ్లా నాయక్.. క్లైమాక్స్ వీళ్ళ గత సినిమాలతో పోలి ఉందని అనుకోవచ్చు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus