Unstoppable with NBK: ‘అన్‌స్టాపబుల్‌ 2’ ఫైనల్‌ ఎపిసోడ్‌ సంగతి ఇంకా తేలలేదా?

బాలయ్య అంటే ఇదే.. ఏ రంగంలోకి దిగినా దబిడి దిబిడే.. అంటూ ‘అన్‌స్టాపబుల్‌ 1’ రెస్పాన్స్‌ పొంగిపోయారు అభిమానులు. కానీ రెండో సీజన్‌కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పొలిటికల్‌ టచ్‌, బోరింగ్, నాన్‌ స్టార్స్ లాంటివి దీనికి కారణాలు అని ఓటీటీయన్స్‌ అంటున్నారు. ఈ విషయం పక్కనపెడితే.. టీమ్‌కి ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. అదే ఫినాలే ఎపిసోడ్‌. ఏదైనా సీజన్‌కు ప్రారంభం, ముగింపు చాలా గొప్పగా ఉండాలి. ముగింపు బాగున్నప్పుడు నెక్స్ట్‌ సీజన్‌ మీద హైప్‌ ఉంటుంది.

అలా ఇప్పుడు ‘అన్‌స్టాపబుల్‌ 2’ ముగింపు ఎపిసోడ్‌కి ఎవరు వస్తారు అనే ఆసక్తి కనిపిస్తోంది. ‘అన్‌స్టాపబుల్ 2’ తొలి రోజుల్లో ఫైనల్‌ ఎపిసోడ్‌కి గెస్ట్‌లు పవన్‌ కల్యాణ్ – త్రివిక్రమ్‌ వస్తారని పుకార్లు వచ్చాయి. అడివి శేష్‌ – శర్వానంద్‌ ఎపిసోడ్‌లో త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. బాలయ్య ఈ మేరకు కొన్ని హింట్లు కూడా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత అలాంటి పుకార్లేం కనిపించలేదు. సరైన గెస్ట్‌లు రాకపోవడం, రెస్పాన్స్‌ తగ్గడంతో ప్రజెంట్‌ ఎపిసోడ్‌ గురించి టీమ్‌ ఎక్కువ కష్టపడుతోంది అని చెప్పొచ్చు.

అలా ప్రభాస్‌ – గోపీచంద్‌ సీన్‌లో వచ్చారు అని అంటున్నారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్‌ అయిపోవడంతో ఇంకా ఐదు ఎపిసోడ్‌లే పెండింగ్‌ ఉన్నాయి. తొలి సీజన్‌ 10 ఎపిసోడ్‌లు సాగింది. ఇప్పుడు ఈ సీజన్‌ కూడా అన్నే ఎపిసోడ్లు అనుకుంటే ఫిబ్రవరి ప్రథమార్ధం ఆఖరులో ఉండాలి. దాని కోసం ఓవైపు అన్‌స్టాపబుల్ టీమ్‌, మరో ఆహా టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నాయట. బాలయ్య టీమ్‌ ప్లానింగ్‌లో పవన్‌ – త్రివిక్రమ్‌ ఉంటే.. ఆహా టీమ్‌ ప్లాన్‌లో చిరంజీవి – రామ్‌చరణ్‌ ఉన్నారట.

మరి ఎవరి ప్లాన్‌ పారుతుంది.. ఎవరు వస్తారనేది చూడాలి. అయితే ప్రభాస్‌ – గోపీచంద్‌ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ ప్రస్తావన వచ్చిందట. ఈ ఎపిసోడ్‌లో వీడియో కాల్‌ రూపంలో చరణ్‌ కనిపిస్తాడట. ఆ సందర్భంగా ఏమన్నా ఫైనల్‌ ఎపిసోడ్‌పై క్లారిటీ వస్తుందేమో చూడాలి అంటున్నారు. బాలయ్య విత్‌ చరణ్‌ కాంబినేషన్‌ ఎలా ఉంటుంది అనేదీ ఆసక్తికరమే.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus