సీతారామశాస్త్రి పాట పాడటం వెనుక ఏం జరిగిందంటే…

  • December 1, 2021 / 05:36 PM IST

పాట రాయడంలో ఆనందాన్ని పొందిన… సిరివెన్నెల సీతారామశాస్త్రి… ఆలపించి అలరించిన సందర్భాలూ ఉన్నాయి. ఆయనే రాసి, బాణీ కట్టి ఆలపించిన గీతాల్లో తొలి పాట ఏంటో తెలుసా? ‘కళ్ళు’ సినిమాలోని ‘తెల్లారింది లెగండోయ్‌…’ అనే పాట. అసలు సిరివెన్నెల… ఆ పాట ఎందుకు పాడాల్సి వచ్చింది, పాడేటప్పుడు జరిగిన గమ్మత్తైన విషయాలను సిరివెన్నెల ఓ సందర్భంలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వివరాలు మీ కోసం… ప్రముఖ సినిమాటో గ్రాఫర్‌ ఎంవీ రఘు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళ్ళు’. ఈ సినిమాకు సంగీత దర్శకుడు… దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

సినిమా కథ మొత్తం తెలిపేలా ఓ పాటను సిద్ధం చేయమని… సిరివెన్నెలకు సూచించారట. దాంతో ఆయన ఓ పాటను రాసి… ఎస్పీ బాలుకు వినిపించారు. పాటను విన్న… బాలు… ‘మీరే పాడండి… మీ గొంతు ఈ పాటకు బాగుంటుంది’ అన్నారట. అయితే మీరుండగా నేనెందుకు అని అన్నారట సిరివెన్నెల. కానీ బాలు అంగీకరించక… సిరివెన్నెలతోనే పాడించారట. పాడటానికి తొలుత అంగీకరించని సిరివెన్నెల… బాలు ప్రోత్సాహంతో పది సార్లు ప్రాక్టీస్‌ చేశారట.

అయితే పదకొండో సారి టేక్‌కి వెళ్దామని సిద్ధమవుతుండగా… టేక్‌ తీసేసుకున్నాను. ఫర్వాలేదు వచ్చేయ్‌. బాగానే పాడావు అని చెప్పారట బాలు. ఈ విషయాల్ని చెబుతూ… సిరివెన్నెల ఆ రోజు వేదిక మీద ఆనందపడిపోయారు. అంతటి గొప్ప సంగీత దర్శకుడి దగ్గర పాడటం అంటే చిన్న విషయం కాదు కదా అని అన్నారు కూడా.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus