The Ghost Trailer: యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అదరగొట్టిన ‘ఘోస్ట్’ ట్రైలర్..!

అక్కినేని నాగార్జున హీరోగా ‘పి.ఎస్.వి గరుడ వేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ విక్రమ్ గా నాగార్జున కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన రెండు ప్రోమోలు – ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇందులో నాగార్జున సూపర్ స్టైలిష్ గా , యాక్షన్ కింగ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇప్పుడు ఆ అంచనాలని రెట్టింపు చేస్తూ థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలైయింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ (నాగార్జున) గ్యాంగ్‌స్టర్ల నుండి ముప్పు ఉన్న తన సోదరి మరియు తన మేనకోడలుని సంరక్షిస్తాను అని అతని తండ్రికి మాట ఇవ్వడం ట్రైలర్ ఆరంభంలో కనిపిస్తుంది . కథాంశం, కథనం రెండూ ఆసక్తికరంగా మలిచినట్లు ట్రైలర్ హింట్ ఇస్తుంది .

ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్ తో పాటు హీరోయిన్ సోనాల్ తో నాగ్ రొమాన్స్ కూడా ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. ఒక నిమిషం 53 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎంతో స్టైలిష్ గా సాగింది.కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని కలిగించింది. నారాయణ్ దాస్ నారంగ్ ప్రెజెంట్స్ తో ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’,

‘నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది ఈ చిత్రం. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus