‘సలార్’ తో (Salaar) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అంతకు ముందు కూడా పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. ‘సలార్’ తో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు అని చెప్పాలి. అతని లేటెస్ట్ మూవీ ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ (The Goat Life) మలయాళంతో పాటు తెలుగులో కూడా మార్చి 28న ఏకకాలంలో విడుదల కాబోతోంది. బెన్యామిన్ రచించిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ డైరెక్ట్ చేశారు.
టీజర్, ట్రైలర్స్ లోని విజువల్స్ అందరినీ కట్టిపడేసే విధంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. ఆ టాక్ ప్రకారం.. ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయినప్పటికీ.. తర్వాత అందరిలో క్యూరియాసిటీ పెంచే విధంగా ఉంటుందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉందని తెలుస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయని, విజువల్స్ అయితే టాప్ నాచ్ అనే విధంగా ఉంటాయి అని స్పష్టమవుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటన, లుక్స్ కి అందరూ ఇంప్రెస్ అయిపోతారట. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయట. స్లో నెరేషన్, డాక్యుమెంటరీ ..ల తలపించే కొన్ని ట్రాక్స్ మినహా సినిమా మొత్తంగా బాగానే ఉంది అంటున్నారు.