Anchor Siva: శివ ఫైనల్స్ వరకూ రావడానికి కారణం ఇదేనా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా కాంట్రవర్సీ శివగా ఎంట్రీ ఇచ్చాడు యాంకర్ శివ. యూట్యూబ్ లో ఇంటర్య్వూస్ చేస్తూ ఫేమస్ అయిన శివ, బిగ్ బాస్ లోకి వెళ్లే సరికి సెలబ్రిటీగా మారాడు. అంతేకాదు, యాంకర్ శివ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిందు మాధవితో ఫ్రెండ్షిప్ కుదిరింది. హౌస్ లో రెచ్చిపోయి మరీ టాస్క్ లు ఆడాడు. అఖిల్, అనిల్, అజయ్, నటరాజ్ మాస్టర్ లాంటి టఫ్ ఫైటర్స్ ని ఎదిరించి టాస్క్ లో గెలిచాడు.

అంతేకాదు, అషూరెడ్డి, అరియానా , హమీదా, సరయు ఇలా అందరితో కొద్దిగా టంగ్ స్లిప్ అయినా కూడా ఆ తర్వాత సారీ చెప్పి, తన స్వభావాన్ని వివరించి వాళ్ల మనసులు గెలిచాడు. ఒకానొక దశలో అయితే, అషూరెడ్డి శివతో మాట్లాడటం కూడా మానేసింది. ఆటలో సహాయం చేయడం కూడా మానేసింది. ఇక బిందు మాధవి సైతం రెండు మూడు సార్లు శివని నామినేట్ చేసింది. ఫ్రెండ్ గా ఉంటూనే శివ ఆట తీరుని తప్పుబట్టింది. అయినా కూడా శివ ఇవేమీ లెక్కచేయకుండా ఆటలో ముందుకు వెళ్లాడు.

శివ జెర్నీ చూస్తుంటే ఇవన్నీ ఒక్కసారిగా ఆడియన్స్ కి గుర్తు వచ్చాయి. సరయు తో మాట్లాడిన మాటలకి నటరాజ్ మాస్టర్ స్టాండ్ తీస్కోవడం, స్టిక్కర్స్, లైక్స్ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ తో జరిగిన గొడవ, అరియానాతో చేసిన ఫన్, బిందు మాధవి ఫ్రెండ్షిప్, మిత్రా శర్మాతో నామినేషన్స్ ఇవన్నీ ఒక్కసారిగా శివకి గుర్తుకు వచ్చాయి. తన జెర్నీ చూసి ఎమోషనల్ అయిపోయాడు శివ. మొదటి నుంచీ తన గేమ్ లో ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేశాడు.

అంతేకాదు, నాగార్జున శివ అంటే ఒక బ్రాండ్ అనేసరికి ఇంకా ఉత్సాహంతో గేమ్ ఆడాడు. ఏడు సార్లు కెప్టెన్సీ పోటీదారుడు అయ్యిన తర్వాత ఎట్టకేలకి బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్ అయ్యాడు. దీనివల్లే శివ హైలెట్ అయ్యాడు. శివ జెర్నీలో ఎక్కువగా తన గేమ్ , టాస్క్ లు ఆడిన తీరు హైలెట్ అయ్యాడు. శివ ఫైనల్స్ వరకూ వచ్చాడంటే కేవలం అది టాస్క్ లలో పెర్ఫామ్ చేయడం వల్లే అని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇక లంగమ్మ క్యారెక్టర్ చేసినపుడు చేసిన ఫన్ శివని హౌస్ లో మరికొన్ని వారాల పాటు సేఫ్ చేసిందనే చెప్పాలి.

ఎప్పటికప్పుడు నామినేషన్స్ లోకి వస్తున్నా కూడా సేవ్ అవుతూ తోటి హౌస్ మేట్స్ కి గట్టి పోటీ ఇచ్చాడు. వేరే హౌస్ మేట్స్ పట్ల ఫ్రెండ్లీగా ఉంటూనే ఇంత దూరం వచ్చాడు. హౌస్ లో ఎలాంటి గొడవలు జరిగినా, నామినేషన్స్ అప్పుడు తిట్టుకున్నా, టాస్క్ లలో కొట్టుకున్నా కూడా ఆ తర్వాత శివ అందరితో సరదాగా కలిసిపోయాడు. ఈ గుణం శివని ఫైనల్స్ వరకూ తీస్కుని వచ్చింది. శివ జెర్నీ చూస్తుంటే అది క్లియర్ గా ఆడియన్స్ కి అర్ధమైంది.

ప్రస్తుతం టైటిల్ రేస్ లో లేకపోయినా కూడా టాప్ 3 పొజీషన్ లో శివ ఉన్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లో కి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నాడంటే నిజంగా గ్రేట్ అనే చెప్తున్నారు శివ ఫ్యాన్స్ అందరూ. అంతేకాదు, సోషల్ మీడియాలో శివ గేమ్ చాలా జెన్యూన్ గా ఆడాడు అని ఓట్ వేయండి అని కూడా ప్రచారం చేస్తున్నారు. అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus