ఈ వారం ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) ‘శబరి’ ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) ‘బాక్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటితో పాటు ‘ది ఇండియన్ స్టోరీ’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అయ్యింది. పెద్దగా చప్పుడు చేయకుండా వచ్చిన ఈ సినిమాలో చమ్మక్ చంద్ర (Chammak Chandra) , సమీర్(Sameer), సి.వి.ఎల్ నరసింహారావు , రామరాజు(Ramaraju), ముక్తార్ ఖాన్ (Mukhtar khan) వంటి సీనియర్లు కూడా నటించారు. మరి కంటెంట్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : హిందూ- ముస్లింల మధ్య గొడవల్ని ఆధారం చేసుకుని ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. అందులో ‘ఖడ్గం’ వంటి క్లాసిక్ కూడా ఉంది. అయితే ‘ది ఇండియన్ స్టోరి’ కథ విషయానికి వస్తే.. ఓ రాష్ట్రంలో హిందూ- ముస్లిం..ల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు) నాయకుడు, ముస్లిం వర్గానికి కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) నాయకుడు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుంది. అలాంటి శత్రుత్వం వీరిది అని అంతా అనుకుంటారు. అయితే ఓసారి వైజాగ్ నుండి రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి) వీరి ఏరియాకి వస్తాడు.
బంగారు బిస్కెట్లు అమ్మడానికి అతని స్నేహితుడు ఫేకు (చమ్మక్ చంద్ర) కోసం అతను అక్కడికి వస్తాడు. ఓసారి అనుకోకుండా కబీర్ ఖాన్ని పై దాడి జరుగుతుంది. ఆ టైంలో ప్రాణాలకు తెగించి మరీ కబీర్ ని కాపాడతాడు రెహమాన్. ఆ తర్వాత అతనికి దగ్గరై ఆ వర్గానికి నాయకుడుగా ఎదుగుతాడు. అదే టైంలో కబీర్ కూతురు డాక్టర్ ఆయేషా (జారా ఖాన్)తో ప్రేమలో పడతాడు. కొన్నాళ్ళకి రెహమాన్ పై కబీర్ పగబడతాడు. అతని పై దాడి కూడా చేయిస్తాడు? అది ఎందుకు? కబీర్ ఎందుకు అలా మారిపోయాడు. వీరి మధ్య ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అనేది మిగిలిన తెరపై చూడాలి.
నటీనటుల పనితీరు : నటీనటుల పనితీరు : హీరో రాజ్ భీమ్ రెడ్డి హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. యాక్షన్ సీన్స్ లో కూడా బాగా చేశాడు అని చెప్పవచ్చు. హీరోయిన్ జారా ఖాన్ కూడా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగానే చేసింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకునే విధంగా ఉంది.
ముఖ్తార్ ఖాన్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది.. మరోసారి విలక్షణమైన పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మంచి మార్కులు వేయించుకున్నాడు. చమ్మక్ చంద్ర కామెడీ రోల్స్ తోనే కాదు సపోర్టింగ్ రోల్స్ తో కూడా ఆకట్టుకోగలను అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రామరాజు ఎప్పటిలానే తన మార్కు నటనతో మెప్పించాడు. సమీర్, సి వి ఎల్ నరసింహారావు కూడా ఉన్నంతలో బాగానే చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా మత కలహాలు వంటివి ఉన్నాయా అంటే.. ఉన్నాయి? ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసిన సినిమా ఇది. మతం ముసుగులో జనాలు మానవత్వాన్ని మర్చిపోయి మృగాలా కంటే ఘోరంగా మారుతున్నారు అని దర్శకుడు ఆర్.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రంతో మరోసారి చాటి చెప్పాడు. ఇది అసలైన బోల్డ్ అటెంప్ట్ అంటే..! సినిమా కామెడీతో స్టార్ట్ అయినప్పటికీ.. ఆ తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాలు అందరినీ కథలో లీనమైపోయేలా చేస్తాయి.
అంత రియలిస్టిక్ గా ఉన్నాయి ఆ సన్నివేశాలు. క్లైమాక్స్ లో ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. మధ్యలో వచ్చే లవ్ స్టోరీకి కూడా అంతా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ లో కొన్ని కీలకమైన ట్విస్ట్..లను రివీల్ చేసిన విధానం బాగుంది. క్లైమాక్స్ మళ్ళీ అందరినీ కట్టిపడేసేలా ఉంటుంది.
విశ్లేషణ : మొత్తంగా చాలా సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘ది ఇండియన్ స్టోరీ’ లో విషయం ఉంది. మంచి మెసేజ్ కూడా ఉంది అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ కోసం కచ్చితంగా థియేటర్లలో చూడదగ్గ సినిమా ఇది అని చెప్పవచ్చు.
రేటింగ్ : 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus