Sreerama Chandra, Maanas: 15వారాల్లో శ్రీరామ్, మానస్ జెర్నీలో హైలెట్స్ అవేనా..?

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ గ్రాండ్ ఫినాలేకి సిద్ధం అయిపోతున్నారు. టాప్ 5 కంటెస్టెంట్స్ వాళ్ల జెర్నీలని చూసుకుని భావోద్వేగానికి గురి అవుతున్నారు. ఇందులో భాగం ఫస్ట్ శ్రీరామ్ చంద్రని పిలిచాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఇప్పటివరకూ జరిగిన హైలెట్ ఎపిసోడ్స్ ని ప్రోపర్టీస్ గా వాడుతూ, ఫోటోగ్రాఫ్స్ ని వాళ్లకి చూపిస్తూ, కొన్ని మధురమైన అనుభూతులతో కూడిన ఫోటోలని ఫ్రేమ్స్ కట్టించి మరీ పెట్టాడు బిగ్ బాస్. ఇది చూసిన శ్రీరామ్ చంద్ర థ్రిల్ అయిపోయాడు.

అంతేకాదు, శ్రీరామ్ కి వెల్ కమ్ చెబుతూ ఇప్పటివరకూ తన ఆట ఎలా సాగిందో బిగ్ బాస్ చెప్తుంటే శ్రీరామ్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఇక జెర్నీ చూస్తున్నంత సేపు ఎంతో భావోద్వేగానికి గురి అయ్యాడు. ఇప్పటివరకూ తను టాస్క్ లు ఆడిన తీరు, తోటి హౌస్ మేట్స్ తో ప్రవర్తించిన విధానం, వాగ్వివాదం, గొడవలు, అల్లర్లు, హమీదాతో ఫ్రెండ్షిప్ ఇవన్నీ కలబోసి మరీ తన జెర్నీని చూపించారు. ఇక్కడే శ్రీరామ్ చంద్ర కెప్టెన్సీ టాస్క్ అప్పుడు హౌస్ మేట్స్ ని కమాండ్ చేయడం, అలాగే అనీమాస్టర్ , రవిలతో బాగా కనెక్ట్ అవ్వడం చూపించారు.

అంతేకాదు, టాస్క్ లలో పెర్ఫామ్ చేస్తూ ఎగ్రెసివ్ అవ్వడం, అందరితో ఆర్గ్యూ చేయడం, ఎగ్రెసివ్ గా మాట్లాడటం శ్రీరామ్ జెర్నీలో హైలెట్ అయ్యాయి. ఆ తర్వాత ఐస్ టాస్క్ లో కాళ్లు బొబ్బలు రావడం, కాస్త లో అవ్వడం కూడా చూపించారు. అంతేకాదు, గెలుపు తలుపులే తీసే ఆకాశమే సాంగ్ వచ్చినపుడు శ్రీరామ్ బాగా ఎమోషనల్ అయ్యాడు. చివరగా తన సిస్టర్ వచ్చిన ఫోటోని తీసుకుని హౌస్ లోకి వచ్చి ఆ అనుభూతిని తోటి హౌస్ మేట్స్ తో పంచుకున్నాడు. ఆ తర్వాత మానస్ జెర్నీ చూపించాడు బిగ్ బాస్.

మానస్ వెళ్తుంటేనే ఉన్న ఫోటోలని చూసి థ్రిల్ అయిపోయాడు.ముఖ్యంగా వాళ్ల అమ్మతో దిగిన ఫోటో అత్యద్భుతంగా ఉందని బిగ్ బాస్ కి చెప్పాడు. మానస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచీ తోటి హౌస్ మేట్స్ కి ఎంతో ఇష్టంగా ఉన్నాడు. లహరికి ఫస్ట్ బాగా కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత కాజల్ తో గేమ్ ఎనాలసిస్ చేశాడు. ఇక పింకీ వచ్చినపటి నుంచీ మానస్ గేమ్ పూర్తిగా మారిపోయింది. పింకీ మానస్ ట్రాక్, సన్నీ – కాజల్ లతో ఫ్రెండ్షిప్ ని జెర్నీలో బాగా హైలెట్ చేశారు.

సన్నీతో కలిసి ఉన్న క్షణాలు, తోటి హౌస్ మేట్స్ అందరూ మానస్ గురించి మంచిగా మాట్లాడటం అనేది చూపించారు. అలాగే, మిగతా వాళ్లు మానస్ గురించి ఏమనుకుంటున్నారు అనేది హైలెట్ చేశారు. నామినేషన్స్, టాస్క్ లతో మానస్ జెర్నీ చాలా ఫీల్ గుడ్ గా ఉంది. ఇది చూసిన మానస్ ఎమోషనల్ అయ్యాడు. ఇక సన్నీ, సిరి, షణ్ముక్ జెర్నీలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus