Badrinath: ‘బద్రీనాథ్’ ఫేమ్ అశ్విని కల్సేకర్ గురించి ఎవ్వరికీ తెలియని షాకింగ్ విషయాలు..!

అల్లు అర్జున్- వి.వి.వినాయక్ కాంబినేషన్లో మొదట బన్నీ అనే సక్సెస్ ఫుల్ మూవీ వచ్చింది. కొంత గ్యాప్ తర్వాత ఈ కాంబోలో ‘బద్రీనాథ్’ అనే భారీ బడ్జెట్ మూవీ వచ్చింది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో రిలీజ్ కు ముందు ‘బద్రీనాథ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ‘మగథీర’ రేంజ్ లో ఈ మూవీ సక్సెస్ అవుతుంది అని అంతా అనుకున్నారు.

కానీ కట్ చేస్తే ఈ మూవీ మరో ‘శక్తి’ అనేలా విమర్శల పాలైంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ మేనత్తగా… లేడీ విలన్ గా చేసిన ఆమె అందరికీ గుర్తుండే ఉంటుంది.ఆమె పేరు అశ్విని కల్సేకర్. అటు తర్వాత ఈమె రవితేజ హీరోగా వచ్చిన ‘నిప్పు’ .. పూరి జగన్నాథ్ కొడుకు హీరోగా తెరకెక్కిన ‘మెహబూబా’ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం వలన ఆమెకు ఇక్కడ మంచి గుర్తింపు లభించలేదు.

నిజానికి ఆమె మరాఠీ, హిందీ సినిమాలతో బాగా పాపులర్ అయిన నటి. అంతేకాదు అశ్విని కల్సేకర్ ఓ టాలీవుడ్ స్టార్ నటుడి భార్య. ఆ నటుడు మరెవరో కాదు మురళీ శర్మ. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు మురళీ శర్మ.నిజానికి ఇతను ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుంటూరలో జన్మించినప్పటికీ పెరిగింది అంతా ముంబైలో..! అటు తర్వాత బాలీవుడ్లో టీవీ ఆర్టిస్ట్ గా పాపులర్ అయ్యాడు మురళీ శర్మ. కానీ ఇతను తెలుగు సినిమాలతోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు.

ఇదిలా ఉండగా.. అశ్విని కల్సేకర్ కు మురళీశర్మ మొదటి భర్త కాదు. మొదట ఆమె నటుడు నితీష్ పాండేని వివాహం చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల 2002 లో వీళ్ళు విడాకులు తీసుకుని సెపరేట్ అయ్యారు. తర్వాత 7 ఏళ్ళకి మురళీశర్మని ఈమె రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ హిందీ సినిమాల్లో నటిస్తూనే ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus