The Legend OTT: ఓటీటీకి ‘ది లెజెండ్’… స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..!

‘ది లెజెండ్‌’ మూవీ జూలై 28 న రిలీజ్ అయ్యింది. ఇదేమీ సూపర్ హిట్ మూవీ కాదు. కానీ ఎందుకు ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎందుకు చర్చ జరుగుతుంది.అది కూడా రిలీజ్ అయ్యి, థియేటర్లలో నుండి వెళ్ళిపోయి 4 నెలలు పూర్తికావస్తున్నా ఎందుకు ఈ సినిమా చర్చల్లో ఉంది. అనే డౌట్ లు కొంతమందికి రావచ్చు. ‘ది లెజెండ్’ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి కారణం…

ఈ చిత్రం హీరో మరియు శరవణ స్టోర్స్‌ అధినేత అయిన అరుళ్‌ శరవణన్‌ వల్లే అని చెప్పాలి.51 ఏళ్ల వయసులో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇతను హీరో మెటీరియల్ కాదు అని పాపం అతనే ఓపెన్ గా ఒప్పుకున్నాడు. కానీ నటన అంటే తనకు ప్యాషన్. అందుకే ‘శరవణ ప్రొడక్షన్స్‌’ అనే బ్యానర్ ను స్థాపించి మరీ రూ.80 కోట్ల బడ్జెట్‌ పెట్టి ఈ పాన్ ఇండియా సినిమాని తీశాడు.

జేడీ- జెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో గీతిక, ఊర్వశి రౌతెలా, ప్రభు, వివేక్, నాజర్ వంటి స్టార్ క్యాస్ట్ నటించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.25 కోట్లు కూడా చేయలేకపోయింది. కేవలం తన శరవణన్ స్టోర్స్ ప్రమోషన్ కోసం మాత్రమే అతను హీరోగా మారి ఈ సినిమా తీసినట్టు స్పష్టమవుతుంది.

అయితే ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ కు డీసెంట్ ఆఫర్స్ వచ్చాయి. కానీ శరవణన్ ఆ ఆఫర్స్ కు ఓకే చెప్పలేదు. అయితే ఎట్టకేలకు అతను ‘ది లెజెండ్’ ను ఓటీటీకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. డిసెంబర్ నెలలో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం. మరి ఇక్కడ ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus