The Legend: ‘ది లెజెండ్’ మళ్ళీ వస్తున్నాడట..!

ఈ మధ్య ప్రతి సినిమాకి క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్టు లీడ్ ఇచ్చి పడేస్తున్నారు. ఫైనల్ కాపీ వాళ్ళు చూసుకున్నాక కూడా ఇలాంటి లీడ్ ఎందుకు ఇస్తున్నారో ఆయా సినిమాల మేకర్స్ కే తెలియాలి. ‘కిక్ 2 ‘ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘సాహో’ ‘స్కంద’ ‘సైంధవ్’ ‘ఈగల్’ .. ఇలా అన్ని సినిమాలకి సీక్వెల్ ఉంటుంది అని క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చారు. సినిమా అంతా బాగోకపోయినా.. లాస్ట్ సీన్లో ఇలాంటి హడావిడి చూసే ప్రేక్షకులకు.. ఇంకా చిరాకు వస్తుంది అనేది నిజం.

సరే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. సినిమాకి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలీనప్పుడు ఇలాంటి ఎపిసోడ్స్.. లాస్ట్ సీన్లో ఉండటాన్ని కొంచెం ఓపిక చేసుకుని అర్థం చేసుకోవచ్చు. మేకర్స్ కూడా రిజల్ట్ బాలేనప్పుడు సీక్వెల్ ఆలోచన మైండ్లో నుండి తీసేస్తారు. కానీ రిలీజ్ అయ్యి డిజాస్టర్ ఫలితం వచ్చి, దేశమంతా ట్రోల్ అయినా.. ఇంకా ఆ సినిమాకి సీక్వెల్ తీయాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్. ఇప్పుడు అలాంటి టాప్ గురించే మాట్లాడుకోబోతున్నాం.

2022 లో ప్రముఖ బిజినెస్ మెన్, కోట్లకు అధిపతి అయిన అరుళ్ శరవణన్‌ (The Legend) ‘ది లెజెండ్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 51 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇవ్వడం అనేది ఆ టైంలో అందరినీ షాక్ కి గురిచేసింది. ఇది పాన్-ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది. ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ వంటి స్టార్లు కూడా నటించారు.

కేవలం శరవణన్ తనని, తన బిజినెస్..లను ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే ఈ సినిమా తీసాడు అని అంతా అనుకున్నారు. అయినప్పటికీ ఈ సినిమాలో ప్రతి సీన్ గురించి ట్రోలింగ్ జరిగింది. అయినప్పటికీ ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలనే ఆలోచనకి శరవణన్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇది మామూలు షాక్ కాదు అనే చెప్పాలి

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus