Guntur Kaaram, LEO: ‘గుంటూరు కారం’ కథ మార్పునకు కారణం మహేష్‌ బాబు కాదా?

త్రివిక్రమ్‌ సినిమాల విషయంలో ట్రోలింగ్‌ భారీగా ఉంటుంది. ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. అయితే అందులో ముఖ్యమైన ట్రోలింగ్ అంటే మాత్రం ‘లార్గో వించ్‌’ సినిమా విషయంలోనే అని చెప్పాలి. ఈ ఫ్రెంచ్‌ యాక్షన్‌ మూవీని స్ఫూర్తిగా తీసుకొని ‘అజ్ఞాతవాసి’ సినిమా తీశారు అనేది నెటిజన్ల వాదన. ఆ మాటకొస్తే ‘లార్గో వించ్‌’ దర్శకుడు జెరోమ్‌ సాలే కూడా దీని గురించి అప్పట్లో ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటున్నారా? ఇలాంటి మరో విపత్తు నుండి త్రివిక్రమ్‌ తృటిలో తప్పించుకున్నారా?

ఇదేం డౌట్… ఇప్పుడేం సినిమా అని అనుకుంటున్నారు. ఇంకేదో కాదు ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ‘గుంటూరు కారం’ గురించే. ఈ సినిమా కథ తొలుత వేరే అనుకున్నారని, కానీ వివిధ కారణాల వల్ల ఆ కథ కాకుండా త్రివిక్రమ్‌ వేరే కథ సిద్ధం చేసుకుని మహేష్‌ను ఒప్పించారని ఓ టాక్‌ నడిచిన విషయం తెలిసిందే. అయితే ఆ మార్పునకు కారణం మహేష్‌ బాబు అని కొందరు అప్పట్లో అన్నారు. అయితే ఇప్పుడు మరో సినిమా సంగతి బయటికొచ్చి ‘గుంటూరు కారం’ సంగతి తేలింది అంటున్నారు.

ఈ విషయం తెలియాలంటే మనం ఇప్పుడు కోలీవుడ్‌ వైపు వెళ్లాలి. అక్కడ లోకేశ్ కనగరాజ్‌ – విజయ్‌ కాంబినేషన్‌లో ‘లియో’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కథ ఓ హాలీవుడ్‌ మూవీ స్ఫూర్తిగా తీసుకొని చేసింది అనేది ఓ పుకారు. ‘ఏ హిస్టరీ ఆఫ్‌ వయలెన్స్‌’ అనే హాలీవుడ్‌ కథకు దగ్గరగా ‘లియో’ ఉంటుందట. ఈ మేరకు రైట్స్‌ కూడా కొనేశారు అంటున్నారు. అయితే ఆ ఆంగ్ల సినిమాను స్ఫూర్తిగా తీసుకొనే త్రివిక్రమ్‌ తొలుత మహేష్‌ సినిమాకు కథ రాసుకున్నారని ఓ మీడియా సంస్థ వ్యాఖ్యానించంది.

అంతేకాదు ‘ఏ హిస్టరీ ఆఫ్‌ వైలెన్స్‌’ హక్కులు (LEO) ‘లియో’ టీమ్‌ తీసుకుందని తెలిశాకనే త్రివిక్రమ్‌ వేరే కథవైపు వెళ్లారు అంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియవు కానీ… ఇలాంటి ఆంగ్ల సినిమాలను చూసి స్ఫూర్తి పొందడం త్రివిక్రమ్‌కు అలవాటు. గతంలో చాలా సినిమా రిఫరెన్స్‌లు ఆంగ్ల సినిమాల్లో కనిపించాయి. కాబట్టి ‘గుంటూరు కారం’ ఘాటు, ‘లియో’ చాక్లెట్‌కి మధ్య గతంలో ఏమైనా రిలేషన్‌ ఉందా అనే ప్రశ్నకు ఆన్సర్‌ ఎవరి దగ్గర నుండి వస్తుందో?

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus