రాధేశ్యామ్ లో ప్రభాస్ స్పానిష్ డైలాగ్స్ కి అర్ధం ఇదే..!

రాధేశ్యామ్ గ్లింప్స్ ని మేకర్స్ చాలా బ్యూటిఫుల్ గా అందంగా చూపించే ప్రయత్నం చేశారు. రోమ్ నగరం అందాలు చూపిస్తూనే డార్లింగ్ ప్రభాస్ ని లవర్ బాయ్ గా చూపించారు. ఈ సినిమా 30 జులైన విడుదల కాబోతోందని ఈ గ్లిపంస్్ లో రిలీజ్ డేట్ ని సైతం ఎనౌన్స్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ లో ప్రభాస్ చెప్పిన స్పానిష్ లాంగ్వేజ్ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అసలు స్పానిష్ లో ప్రభాస్ ఏం చెప్పాడు అని ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేసేస్తున్నారు.

” Sei Un Angelo..? Devo Morire per incontrarti ” అంటూ ప్రభాస్ హీరోయిన్ పూజాహెగ్దేని ఉద్దేశ్యించి డైలాగ్ చెప్పాడు. దీనికి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్లిపోయింది పూజా హెగ్దే. ఇప్పుడు అసలు ఈ వర్డ్స్ కి అర్ధం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. Sei Un Angelo – అంటే Your An Angel అని అర్ధం. తెలుగులో చెప్పాలంటే దేవకన్యాలా ఉన్నావ్ అంటారు కదా అలాంటిదన్నమాట. నీవు ఒక దేవకన్యవి… Devo Morire per incontrarti అంటే Do I have to die to meet you ? అని అర్ధం.

అంటే నిన్ను మళ్లీ కలవాలంటే నేను చచ్చిపోవాలా అని హీరో హీరోయిన్ ని అడుగుతున్నాడు. దీనికి హీరోయిన్ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లిపోతోంది. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా అని తర్వాత డైలాగ్ లో పూజా హెగ్దే అడగడం, ఛీ.. వాడు ప్రేమకోసం చచ్చాడు.. కానీ నేను ఆ టైప్ కాదు అని ప్రభాస్ తనదైన స్టైల్లో చెప్పడం గ్లింప్స్ లో హైలెట్ గా నిలిచింది. దీనిని బట్టీ చూస్తే వీరిద్దరిదీ ఎంతటి మధురమైన ప్రోమో అర్ధం అవుతోంది. ఈ సినిమాతో ఖచ్చితంగా ప్రభాస్ అందర్నీ ప్రేమలో పడేస్తాడు అనడంలో సందేహం లేదు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus