నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్లో ‘దసరా’ (Dasara) అనే సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. నానిని వంద కోట్ల క్లబ్లో చేరిన సినిమా అది. దాని తర్వాత వీరి కాంబినేషన్లో ‘ది పారడైజ్’ (The Paradise) అనే సినిమా వస్తుందని ప్రకటించారు. ‘దసరా’ ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ‘ఇది నా కెరీర్లోనే భయంకరమైన వయొలెన్స్ తో కూడుకున్న సినిమా.. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని విధంగా ఉంటుంది’ అని నాని పలు ఇంటర్వ్యూల్లో ‘ది పారడైజ్’ గురించి చెప్పిన సంగతి తెలిసిందే.
అది నిజమే అని తాజాగా విడుదలైన గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. ‘ది పారడైజ్’ (The Paradise) గ్లింప్స్ విషయానికి వస్తే ఇది.. 1:46 సెకన్లు నిడివి కలిగి ఉంది. ‘చరిత్రలో అందరూ చిలకలు,పావురాల గురించి రాశారు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవ్వరూ రాయలేదు’ అనే డైలాగ్ తో గ్లింప్స్ మొదలైంది. ‘ఇది కడుపు మండిన కాకుల కథ..
జమానా జమానాకెల్లి నడిచే శవాల కథ’ అంటూ వచ్చే తర్వాతి డైలాగ్ ను బట్టి.. ఈ సినిమా (The Paradise) థీమ్ ఏంటనేది చెప్పకనే చెప్పారు. ‘తు అనిపించినా కాకులు తల్వార్లు పట్టినయ్’ అనే డైలాగ్ కూడా బాగుంది. ఈ గ్లింప్స్ మొత్తానికి హైలెట్ అయ్యింది అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :