తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతమంది మహా దర్శకులున్నారు. అత్యధిక సక్సస్ రేట్ తో వంద చిత్రాలను పూర్తి చేసుకున్నవారు కూడా ఉన్నారు. కానీ వారెవ్వరూ రాజమౌళికి సాటిరారు. కేవలం పదకొండు చిత్రాలు చేసిన జక్కన్న వందేళ్లకు సరిపడా పేరు తెచ్చుకున్నారు. వంద సినిమాలతో సమానమైన క్రేజ్ సంపాదించారు. ఇతర దర్శకుల నుంచి దర్శకధీరుడిని వేరు చేసి చూపించగల గొప్ప లక్షణాలపై ఫోకస్..
మంచి కథకుడు (బెస్ట్ స్టోరీ టెల్లర్ )కథను అందంగా తెరమీద చెప్పగలగడం దర్శకులు ఉండాల్సిన ప్రధాన లక్షణం. అందులో వందకి వంద మార్కులు కొట్టేసారు రాజమౌళి. ముఖ్యంగా జానపద కథలను అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించే ప్రతిభ జక్కన్నకి చందమామ కథలను చదివినప్పుడే వచ్చింది.
ఊహాత్మక శక్తి (విజన్ )రాజమౌళి ఊహాత్మక శక్తి అద్భుతం. అతని ఆలోచనతో సాధారణమైన కథ కూడా కొత్త ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తుంది. అందుకు ఉదాహరణే యమదొంగ, ఈగ. చిన్న లైన్ ని చక్కగా విజువలైజేషన్ చేసి మెస్మరైజ్ చేశారు.
నిబద్ధత (డెడికేషన్) ఏ దర్శకుడు తన ప్రతి సినిమాని పూర్తి డెడికేషన్ తో చేయలేరు. కానీ రాజమౌళి ప్రతి సినిమాని నిబద్దతతో, అంకితభావంతో పనిచేస్తారు. ఒకే ఒక బాహుబలి కోసం ఐదేళ్లు యజ్ఞంలా పని చేశారు.
పక్కాగా ప్రతి షాట్ప్రతి షాట్ పక్కాగా వచ్చేవరకు రాజమౌళి కాంప్రమైజ్ కారు. ఒక్క షాట్ కోసం ఒక్కరోజైనా తీయడానికి వెనుకాడరు. షాట్ తనకి సంతృప్తి కలిగిస్తేనే నెక్స్ట్ షాట్ కి వెళ్తారు. అందుకే అతన్ని అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు.
గొప్ప నాయకుడు గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి రాజమౌళి. ఇప్పటివరకు అతనిపై ఏ ఆర్టిస్టు, టెక్నీషియన్ నెగిటివ్ గా కామెంట్స్ చేయలేదు. ఎన్నో వేలమంది పనిచేసిన బాహుబలి షూటింగ్ సమయంలోను జక్కన్న అందరిని సమన్యయం పరిచిన విధానం అమోఘం. కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నసమాధానం లీక్ కాకుండా రెండేళ్లు ఆగిందంటే అది రాజమౌళి నాయకత్వ లక్షణానికి నిదర్శనం.
ప్రతిభను గుర్తించే నేర్పు ఏ నటుడిలో ఎటువంటి ప్రతిభ ఉందో గుర్తించడంలో రాజమౌళికి మంచి ట్యాలెంట్ ఉంది. తన సినిమాలోని క్యారక్టర్ కి ఎవరు సూటవుతారో కరక్ట్ గా సూటవుతారు. అతని సినిమాలో ఆ పాత్రకి ఫలానా నటుడు అయితే బాగా సరిపోతారనే మాట ఇప్పటివరకు ఎవరి నోటా నుంచి రాలేదు. అంతేకాదు బాహుబలిలో బాహుబలి పాత్ర మాత్రమే కాదు శివగామి, దేవసేన, కట్టప్ప.. ఇలా ఆ పాత్రల్లో వేరే నటుల్ని ఊహించుకోలేము. అది అతని కాస్టింగ్ సెలక్షన్ అంటే.
సక్సస్ రేట్ సినిమా విజయం సాధిస్తుందో, లేదో ముందే చెప్పలేము… ఈ కథని ప్రేక్షకులు స్వీకరించలేదు.. ఆడియన్స్ అంతగా డెవలప్ కాలేదు.. అనే మాటలు రాజమౌళి దగ్గర పొరపాటుగానైనా రావు. అసలు ఓటమి జక్కన్న వద్దకు వెళ్ళడానికి భయపడుతుంది. స్టూడెంట్ నంబర్ వన్ నుంచి బాహుబలి కంక్లూజన్ వరకు దర్శకధీరుడు చేసిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అంటే వందశాతం సక్సస్ రేటు అన్నమాట. ఇంతవరకు ఏ డైరక్టర్ కి ఈ సక్సస్ రేటు సాధించలేదు. కొనసాగించలేదు.
నిగర్వి ఒక్క మూవీ హిట్ సాధించగానే కళ్ల మీదకి కళ్ల జోళ్లు వచ్చేస్తున్నా ఈ సమయంలో.. సినిమాకి సినిమాకి సక్సస్ స్థాయిని పెంచుకుంటూ, భారతీయా చలన చిత్ర పరిశ్రమ గర్వపడే సినిమాలను తీస్తున్న రాజమౌళికి గర్వం పాదాలను కూడా తాకలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రశంసించిన ఆ మాటలను చెవికి మాత్రమే చేరుతాయి.. తలకి ఎక్కలేదు. ఎక్కదు. అందుకే ఆయనంటే అందరికీ అభిమానం. ప్రత్యేక గౌరవం.